సెకండ్ల వ్యవధిలో తప్పిన ప్రమాదం, ఒకే రన్ వేలో రెండు విమానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న గోఎయిర్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆ సమయంలో వందమంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ సంఘటన గత వారం చోటు చేసుకుంది.
గో ఎయిర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అదే రన్ వే పైకి ఓ ప్రయివేటు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది. కొన్ని సెకండ్ల తేడాలో రెండు విమానాలు ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు.

మే మూడో తేదీన గో ఎయిర్ విమానం ల్యాండ్ అవుతుండగా పైలట్ రన్‌వేపై మరో ప్రయివేటు విమానంను గుర్తించారు. అయితే విమానం ల్యాండ్ అవ్వడానికి కేవలం సెకన్ల ముందు ఆ ప్రయివేటు విమానం గో ఎయిర్ విమానం ముందు నుంచి వెళ్లిపోయింది. అది కొన్ని క్షణాలు ఆలస్యమైతే రెండు విమానాలు ఢీకొట్టుకునేవి.
గో ఎయిర్ విమాన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు సరిగ్గా పాటించలేదని అధికారులు చెప్పారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా స్టాప్ బార్ దాటేసి ఆ విమానం వచ్చిందన్నారు. దీనిపై గో ఎయిర్ స్పందించింది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోందని, తాము విచారణకు విధాలా సహకరిస్తామని తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications