లెఫ్టినెంట్ కల్నల్ భార్యతో రాసలీలు: రెడ్‌హ్యండెడ్‌గా పట్టివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూదిల్లీ:లెఫ్టినెంట్ కల్నల్ ఇతర ప్రాంతానికి వెళ్ళడంతో...ఆయన భార్యతో కల్నల్ రాసలీలల్లో మునిగిపోయారు. ఆర్మీ పోలీసులు వారిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని భంటియా జిల్లాలో చోటుచేసుకొంది.

అక్టోబర్‌ 26 తెల్లవారుజామున సైన్యానికి చెందిన పోలీసులు పంజాబ్‌లోని భంటియా జిల్లాలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ నివాసంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఓ కల్నల్‌ పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం కల్నల్‌ను ఇతర విభాగానికి అటాచ్‌ చేశారు.

Colonel caught with junior’s wife after army search home on husband’s tip-off

కల్నల్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ సైన్యంలోని ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిమిత్తం చండీగఢ్‌ వెళ్తున్న సమయంలో ఆయన ఆదేశాలతోనే పోలీసులు ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. దీంతో కల్నల్‌ గుట్టురట్టయింది. ఆర్మీ చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి వ్యవహారాలను సైన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. అధికారుల వ్యవహారశైలిపై ఆర్మీ బోర్డు ఓ కన్నేసి ఉంచుతుందని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు.. సహోద్యోగి కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ లెఫ్టినెంట్‌ స్థాయి అధికారిని ఇటీవలనే తొలగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A serving colonel has landed in trouble for having an affair with a subordinate’s wife, sources said on Wednesday.The army has ordered a probe against the colonel after the military police caught him with the lieutenant colonel’s wife at the latter’s home in Punjab’s Bathinda district. Both officers are from the Corps of Engineers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి