కల్నల్ సోఫియా ఖురేషీ ఫ్యామిలీకి ఇంత చరిత్ర ఉందా..? రాణి లక్ష్మీబాయితో కలిసి..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్, ఫొటోలను గతంలోనే విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం జరిపిన దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అలాగే ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా భారత్ పై వందల కొద్దీ డ్రోన్ లు, క్షిపణులతో పాకిస్థాన్ రెచ్చిపోయింది. కానీ భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ధ్వంసం చేసింది.
అయితే ఆపరేషన్ సింధూర్ అధికారిక సమాచారాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం.. త్రివిధ దళాల అధికారులతో, విదేశాంగ శాఖ అధికారులతో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాల్లోని మహిళలతో ఈ మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగానే ఇండియన్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. వీరికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే.

అయితే వీళ్లు తాజాగా బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా చేస్తున్న ప్రముఖ టీవీ ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో కల్నల్ సోఫియా ఖురేషీ.. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడారు. " నేను సైనికుల కుటుంబం నుంచి వచ్చాను. మా నాయనమ్మ వాళ్ల అమ్మకు చెందిన పూర్వికులు రాణి లక్ష్మీబాయితో కలిసి పోరాటం చేశారు. సైనికుల త్యాగాలు, దేశ చరిత్ర, వీరుల ప్రసంగాలు తెలుసుకుంటూ పెరిగాను. ఇండియన్ ఆర్మీలో ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ ఒకేలా ట్రైనింగ్ ఉంటుంది" అని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.












Click it and Unblock the Notifications