36 ప్రాంతాలపై 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడి.. వివరాలు వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీ

భారత్ పై పాకిస్థాన్ భీకర దాడికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి భారత్ లోని సియాచిన్(లద్దాక్) నుంచి కచ్(గుజరాత్)వరకు 36 ప్రాంతాల్లో పాకిస్థాన్ దాదాపు 300- 400 డ్రోన్లు ప్రయోగించినట్లు కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.

ఈ డ్రోన్లకు కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయని.. అక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ ఇలా పన్నాగం పన్నినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లు వివరాలు వెల్లడించారు. అయితే ఈ డ్రోన్లను నాశనం చేసినట్లు పేర్కొన్నాయి.

Colonel Sophia Qureshi Reveals Pakistan s Massive Drone Offensive 400 Drones 36 Targets

మరోవైపు ప్రాథమిక నివేదిక ప్రకారం టర్కీ తయారీ డ్రోన్లను పాకిస్థాన్ ప్రయోగించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అంతేకాక పాకిస్థాన్‌ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఇక పాకిస్థాన్ పై భారత్ ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం ఆపరేషన్ సిందూర్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీసింది భారత ఆర్మీ. అత్యాధునిక క్షిపణులతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రమూకలు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. అయితే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+