వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ఎప్పటికి గుర్తుండి పోతుంది: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో గత డెబ్బై సంవత్సరాల హింసాయుత చరిత్రకు చరమ గీతం పాడిన ప్రధానమంత్రి మోడీ, ఆర్టికల్ 370 రద్దుతోపాటు రాష్ట్ర విభజన చేపట్టిన మోడీ రెండు రోజుల పరిణామాల అనంతరం మొదటి సారి స్పందించాడు. కశ్మీర్ విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పోందిన అనంతంర ఆయన అంతరంగాన్ని ట్విట్టర్‌లో ఆవిష్కరించాడు.

కశ్మీర్ విభజన పై పలు రాష్ట్రాల ఎంపీలు విభేదాలను పక్కన పెట్టి జమ్ము మరియు కశ్మీర్ తోపాటు లడాఖ్ ప్రాంతాల అభివృద్ది ,శాంతి కోసం చర్చించారని, ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలు గర్వపడుతున్నారని ఆయన పేర్కోన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఎంపీలు మద్దతు పలికారని అన్నారు. అందరం కలిసి 130 కోట్ల భారత ప్రజల కళలను సాకారం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

comments on the J and K Reorganisation Bill PM Narendra Modi called it a momentous occasion

మొత్తం మీద కశ్మీర్ విభజన,ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.వారం రోజుల పాటు నెలకొన్న ఉత్కంఠకు ఒక్కరోజులోనే ముగింపు పలికి దశాబ్ధాలుగా నానుతున్న కశ్మీర్ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టారు.ఆర్టికల్ రద్దుతో జమ్ము కశ్మీర్ సైతం అన్ని రాష్ట్రాలకు ఉన్న రాజ్యంగ నిబంధనలే వర్తిస్తాయి.

కాగా గత కొన్ని రోజులుగా బిల్లుపై కసరత్తు చేసి అనూహ్య పరిణామాల మధ్య రాజ్యసభలో సరైన బలం లేకున్నా ప్రభుత్వానికి అనుకూలంగా మెజారీటీ ఓట్లతో బిల్లును పాస్ చేయించే వ్యుహాలను మోడీ రచించాడు. ముందుగా తనకు బలం లేని రాజ్యసభలోనే బిల్లును పెట్టి వ్యూహత్మకంగా వ్యవరించాడు. ప్రతిపక్షాలను తన దారిలోకి తీసుకు వచ్చి మొత్తం మీద బిల్లుపై చర్చించేందుకు తన దారిలోకి తీసుకు వచ్చి చివరకు మెజారితో బిల్లునను పాస్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయాడు. అంతపెద్ద నిర్ణయం తీసుకుని లోక్‌సభలో సాధరణ సభ్యుడిగా కూర్చుని తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చిన ప్రధాని చివరికి ఎంపీలకు కృతజ్ఝతలు తెలిపి జమ్ము కశ్మీర్ భవిష్యత్‌కు పాటు పడాలని సూచించాడు.

English summary
In his very first comments on the Jammu and Kashmir Reorganisation Bill, minutes after it was passed in the Lok Sabha, Prime Minister Narendra Modi called it a ‘momentous occasion’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X