• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంత తేడా? చంద్రయాన్-2 ఖర్చు రూ. 978 కోట్లు: వైట్ టాపింగ్ రోడ్ల వ్యయం రూ.986 కోట్లు!

|

బెంగళూరు: రోడ్ల నిర్మాణంలో సరికొత్తగా వచ్చిన టెక్నాలజీ వైట్ టాపింగ్. దాదాపు దేశంలోని అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లో రోడ్ల నిర్మాణానికి తారుకు బదులుగా వైట్ టాపింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం.. ఇలా అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదివరకు ఉన్న తారు రోడ్లతో పోల్చుకుంటే ఈ వైట్ టాపింగ్ రోడ్లు ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉంటాయనేది అధికారుల అంచనా. రోడ్లపై గుంతలు పడటం గానీ, ఓ మోస్తరు వర్షం వస్తే.. తారు మొత్తం కొట్టుకుని పోయి కంకర తేలడం గానీ ఉండవనే ఉద్దేశంతో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకున్నారు. నాణ్యత మాటెలా ఉన్నా ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోందనే అభిప్రాయాలు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

చంద్రయాన్-2 ఖర్చు ఎక్కడ? రోడ్డ నిర్మాణ వ్యయం ఎక్కడ?

చంద్రయాన్-2 ఖర్చు ఎక్కడ? రోడ్డ నిర్మాణ వ్యయం ఎక్కడ?

చంద్రయాన్-2 ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 978 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఖర్చును కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ భరించింది. భూ ఉపరితలం నుంచి చంద్రమండలం మధ్య ఉన్న దూరం.. 3,84,400 కిలోమీటర్లు. చంద్రయాన్-2 మిషన్ అంతదూరం ప్రయాణించడానికి, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడి ఉపరితలం మీద ప్రవేశపెట్టడానికి ఇస్రో శాస్త్రవేత్తలు పెట్టిన ఖర్చు 978 కోట్ల రూపాయలు. అదే సమయంలో- బెంగళూరులో వైట్ టాపింగ్ వేయడానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన వ్యయం 986 కోట్ల రూపాయలు. బెంగళూరు మహానగర పాలికె పరిధలో కేవలం 94 కిలోమీటర్ల దూరం పాటు వైట్ టాపింగ్ రోడ్లను వేయడానికి చేసిన ఖర్చు అది.

94 కిలోమీటర్ల వైట్ టాపింగ్ కు వెయ్యి కోట్లు

94 కిలోమీటర్ల వైట్ టాపింగ్ కు వెయ్యి కోట్లు

భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న 3,84,400 కిలోమీటర్ల దూరానికి ఇస్రో చేసిన ఖర్చు ఎక్కడ? 94 కిలోమీటర్ల మేర వైట్ టాపింగ్ రోడ్డు కోసం బీబీఎంపీ అధికారులు చేసిన ఖర్చు ఎక్కడ? ప్రతి వంద కిలోమీటర్ల దూరంలో వైట్ టాపింగ్ రోడ్లను వేయడానికి బృహన్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు కాస్త అటూ ఇటుగా 1000 కోట్ల రూపాయలను వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నెటిజన్లు. చంద్రయాన్-2 మిషన్, బెంగళూరులో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణనికి చేసిన ఖర్చును పోల్చుకుంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు నెటిజన్లు, ట్విట్టరెటీలు. ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న వ్యయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోకులు టపాసుల్లా పేలుతున్నాయి.

దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే చంద్రయాన్-2

దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే చంద్రయాన్-2

దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసే ప్రాజెక్టు చంద్రయాన్-2 కోసం ఎంత ఖర్చు చేసినా ఫర్వాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో వంటి శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా సంస్థల్లో అవినీతికి ఎంతమాత్రమూ అవకాశం ఉండదనే బలమైన విశ్వాసం ప్రజల్లో వ్యక్తం కావడం సహజం. మనదేశంలో మౌలిక నిర్మాణ రంగంలో పెట్టే ఖర్చు కాస్త అధికంగానే ఉంటుందనే వారూ లేకపోలేదు. రోడ్లు, ప్రభుత్వ భవన సముదాయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి పట్టణ లేదా నగరాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి చేసే ఖర్చు ఎలా ఉంటుందనడానికి ఈ వ్యత్యాసం ఓ నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రతి రూపాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేస్తారనే గ్యారంటీ ఎంత మాత్రమూ లేదనే విషయం అందరికీ తెలుసు.

అవినీతిపరుల జేబుల్లో కుక్కడానికే నిధులు..

రోడ్ల నిర్మాణానికి, వైట్ టాపింగ్ ప్రాజెక్టు కోసం చేసే ప్రతి రూపాయిలో కనీసం 30 శాతం అవినీతిపరుల జేబుల్లో పోతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. అవినీతి రహితంగా మౌలిక సదుపాయాలను కల్పించగలిగితే ప్రభుత్వ ఖజానాలో ఎప్పుడూ కాసులు గలగలలాడుతూనే ఉంటాయని, అలాంటి అవకాశాన్ని కల్పించడానికి అవినీతికి, లంచానికి అలవాటు పడ్డ ఏ రాజకీయ నాయకుడు గానీ, ఏ ప్రభు్త్వ అధికారి గానీ, చివరికి ఏ కాంట్రాక్టరు గానీ సిద్ధంగా లేరని చెబుతున్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనాన్ని తమ జేబుల్లో నింపుకోవడానికి వెనుకాడని అధికారులు, రాజకీయ నాయకులు ప్రతిచోటా, ప్రతి రంగంలోనూ ఉంటారని, శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో పనిచేసే అవినీతిపరులైన శాస్త్రవేత్తలు ఉంటారనే విషయాన్ని కనీసం ఊహించుకోలేమని చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Interesting comparison between Chandrayaan-2 Mission cost and expenditure on White topping roads in Bengaluru. Some twitterities and Netizens are dare to comparison expenditure on the both Projects. Chandrayaan 2 budget with NASA and Hollywood movies is far-fetched. In Bengaluru, more relatable comparison that Chandrayaan-2 Mission Cost was Rs.978 Crores for 384,400 Kilo Meters. Where as White-topping road Project in Bengaluru roads as Rs. 986 Crore for just 94 Kilo Meters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more