Student: ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్, మ్యాటర్ రివర్స్, ముగ్గురు విద్యార్థులు?
జైపూర్/రాజస్థాన్: పోటీ పరీక్షల్లో విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి అనుకున్న కోర్సుల్లో సీటు సంపాధించి ఉన్నత చదువులు చదవాలని అనుకున్నారు. ఫేమస్ కోచింగ్ సెంటర్ లో అందరూ చేరారు. కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు పోటీ పరీక్షలు రాయకుండానే సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది.
రాజస్థాన్ లోని జైపూర్ సిటీలోని ప్రముఖ కోచింగ్ సెంటర్ లో ప్రభుత్వ ఉద్యోగాల సంపాధించాలని ప్రయత్నిస్తున్న యువతి, యువకులకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రతినెల వందాలది మంది విద్యార్థులు జైపూర్ లోని పలు కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కోచింగ్ తిసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని అనేక మంది యువతి యువకులు ప్రయత్నిస్తున్నారు.

ఓ కోచింగ్ సెంటర్ లో అంకుష్, ఉజ్వల్, ప్రణవ్ అనే ముగ్గురు యువకులు చేరారు. ముగ్గురిలో ఇద్దరు ఇంజనీరింగ్ లో, ఓ యువకుడు ఎంబీబీఎస్ లో సీటు సంపాధించాలని కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతిరోజు క్రమంగా తప్పకుండా ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్న ఇన్సిట్యూట్ కు వెలుతున్నారు.
అయితే కోచింగ్ క్లాసుకులకు వెలుతున్న అంకుష్, ఉజ్వల్, ప్రణవ్ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో సాటి విద్యార్థులు హడలిపోయారు. కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు సీటు వస్తుందో, రాదో ? అనే అనుమానంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications