సౌమ్యా రెడ్డిపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు, సిట్టింగ్ ఎంపీ గురించి ఇలా ?, వీడియో వైరల్ చేస్తే !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో లోక్ సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్యా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదే నెల 13వ తేదీన బెంగళూరులోని బసవనగుడిలో గురురాఘవేంద్ర సహకార బ్యాంకుల డిపాజిటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో డిపాజిట్లు కోల్పోయిన వారిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఆయన వర్గీయులు దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Complaint to Election Commission against Bengaluru Congress leader Soumya Reddy

బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ తేజస్వి సూర్యా ఒక కార్యక్రమంలో రచ్చ సృష్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తేజస్వి సూర్యా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గందరగోళం సమయంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఆ కార్యక్రమం నుంచి అర్దాంతరంగా బయలుదేరి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై తేజస్వి సూర్యా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి, ఆమె మద్దతుదారులపై బసవనగుడి రాఘవేంద్ర సహకార బ్యాంకు ప్రతినిధులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

Complaint to Election Commission against Bengaluru Congress leader Soumya Reddy

ఏప్రిల్ 13వ తేదీన బసవనగుడిలో రాఘవేంద్ర సహకార సంఘం ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యాను ఆహ్వానించామని, ఆ కార్యక్రమానికి కాంగ్రెస్‌ కు ఎలాంటి సంబంధం లేదని, అయితే ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్న వాళ్లు ఆహ్వానం లేకుండా అక్కడికి బలవంతంగా వచ్చి మీటింగ్‌లో గొడవ చేశారని, తరువాత కార్యక్రమానికి అంతరాయం కలిగించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యా రెడ్డితో పాటు ఆమె మద్దతుదారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని బసవనగుడిలోని రాఘవేంద్ర సహకార బ్యాంకు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+