వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో లాక్ డౌన్ విధింపు ... కరోనా కట్టడికి ఈ రోజు అర్ధరాత్రి నుండి వారం రోజుల పాటు కర్ఫ్యూ !!

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనావైరస్ కేసుల రికార్డు స్థాయిలో పెరుగుదల దృష్ట్యా ఢిల్లీ సర్కార్ కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుండి వచ్చే సోమవారం ఉదయం వరకు పూర్తిగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది.
కఠిన ఆంక్షలకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది .

నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. ఆపుతావా .. కరోనా రూల్స్ పాటించకుండా ఢిల్లీలో ఓ జంట హంగామా !!నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. ఆపుతావా .. కరోనా రూల్స్ పాటించకుండా ఢిల్లీలో ఓ జంట హంగామా !!

 ఢిల్లీలో గత 24 గంటల్లో 25,462 కొత్త కరోనా కేసులు, 167 మరణాలు

ఢిల్లీలో గత 24 గంటల్లో 25,462 కొత్త కరోనా కేసులు, 167 మరణాలు

ఢిల్లీలో గత 24 గంటల్లో 25,462 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి . విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. దాదాపు 30 శాతం పాజిటివిటీ రేటుతో దేశ రాజధాని ఢిల్లీ ఉంది అంటే నగరంలో పరీక్షించబడుతున్న ప్రతి మూడు పరీక్షలలో ఒక పరీక్ష కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది. ఇప్పటికే రాజధానిలో వారాంతపు కర్ఫ్యూ అమల్లో ఉంది. గత 24 గంటల్లో ఢిల్లీ నగరంలో 24,462 కోవిడ్ -19 కేసులు, 167 మరణాలు సంభవించాయి.

లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమై కోవిడ్ కంట్రోల్ కోసం కేజ్రీవాల్ కీలక నిర్ణయం

లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమై కోవిడ్ కంట్రోల్ కోసం కేజ్రీవాల్ కీలక నిర్ణయం

రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షల కోసం ఢిల్లీ సిద్ధంగా ఉంది. గత రెండు రోజుల్లో, దాదాపు 50,000 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా , కోవిడ్ తో దాదాపు 330 మంది మరణించారు. పెరుగుతున్న కేసులు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం, ఆక్సిజన్ కొరత వెరసి ఢిల్లీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. సిఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమై వారాంతపు కర్ఫ్యూ ప్రభావం గురించి చర్చించి, వారాంతపు కర్ఫ్యూ పొడిగింపుతో సహా మరిన్ని ఆంక్షలపై నిర్ణయం తీసుకున్నారు .

వారం రోజుల పాటు కర్ఫ్యూ విధింపు .. ఈ రోజు అర్ధరాత్రి నుండే అమలు

వారం రోజుల పాటు కర్ఫ్యూ విధింపు .. ఈ రోజు అర్ధరాత్రి నుండే అమలు

ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం వరకు ఢిల్లీలో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.


ఢిల్లీ ప్రభుత్వం ఒక వారం ఈ రోజు అర్ధరాత్రి నుండి లాక్ డౌన్ విధించాలని సోమవారం ఉదయం ఎల్‌-జి అనిల్‌ బైజల్‌, సిఎం కేజ్రీవాల్‌ల మధ్య జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం .

English summary
Delhi will be under complete curfew from tonight to next Monday morning amid a record rise in coronavirus cases.On Sunday, Delhi recorded the biggest jump in its daily Covid tally with 25,462 fresh cases, with a positivity rate of nearly 30 per cent -- meaning almost every third sample being tested in the city is turning out to be positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X