• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాపై ఇంకెప్పుడు కన్నెర్ర చేస్తారు?: మోడీపై కాంగ్రెస్ అటాక్: డ్రాగన్ దుందుడుకుపై ఫైర్

|

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి గల పంగ్యాంగ్ త్సొ లేక్ సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. చైనా దుందుడుకు చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంత్రించలేకపోతున్నారంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, అనుసరిస్తోన్న విధానాల వల్ల చైనా పేట్రేగిపోతోందని ఆరోపణలను గుప్పించింది.

రాఫేల్ జెట్స్: అత్యాధునిక ఫైటర్ జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!

పేట్రేగిన చైనా సైనికులు: లఢక్ సరిహద్దుల్లో..మళ్లీ: భారత భూభాగంపైకి: అడ్డుకున్న జవాన్లతో

దేశ రక్షణలో సైన్యం సదా నిమగ్నమై ఉంటోందని, చైనా వైఖరితో మరింత ఒత్తిళ్లకు గురవుతోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటు ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకుని ట్వీట్‌ను సంధించారు. లఢక్ ఈశాన్య ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించగా.. మనదేశ సరిహద్దు భద్రతా బలగాలు వారిని నిలువరించినట్లు వార్తలు వచ్చిన వెంటనే ఆయన స్పందించారు.

Congress attacks on Modi over the Fresh border disputes at Eastern Ladakh

పవిత్ర భారత భూమిని ఆక్రమించుకోవడానికి చైనా మరోసారి దుస్సాహసానికి పాల్పడిందని సుర్జేవాలా విమర్శించారు. ప్రతి రోజూ కొత్తగా చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పంగ్యాంగ్ త్సొ ప్రాంతం, గోగ్రా పోస్ట్ లేక గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్ మైదాన ప్రాంతం, లిపులేఖ్, డోక్లామ్, నకు లా పాస్.. ఇలా సరిహద్దు ప్రాంతాలపై తన పెత్తనాన్ని చెలాయించడానికి ప్రయత్నాలను సాగిస్తోందని అన్నారు. ఇవన్నీ తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఆరోపించారు.

  Ladakh Face Off : India - China బలగాల మధ్య ఘర్షణ.. భారత్ లోకి దూసుకొచ్చేందుకు China యత్నం!

  భరతమాత రక్షణలో, భారత భూమిని ఇంచి కూడా చేజారి పోకుండా సరిహద్దుల్లో భద్రతా బలగాలు రొమ్ము విరుచుకుని నిల్చున్నాయని అన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని చురకలు అంటించారు. నరేంద్ర మోడీ ఇంకెప్పుడు చైనాపై కన్నెర్ర చేస్తారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ కళ్లు ఎర్రబడటాన్ని తాము ఇప్పట్లో చూడలేమా? అని ఎద్దేవా చేశారు. తన ట్వీట్‌కు ఆర్మీ అధికారులు విడుదల చేసిన ప్రకటనను జత చేశారు.

  సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపూరక వాతావరణం సంభవించిన చేసుకున్న విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాత్రి వేళ ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకనట విడుదల చేశారు. శని, ఆదివారాల్లో ఛుసుల్ బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి పంగ్యాంగ్ త్సొ లేక్ దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసకున్నట్లు తెలిపారు.

  English summary
  Congress attacks on Prime Minister Narendra Modi over the fresh border disputes at Eastern Ladakh on Monday. Congress leader Randeep Surjewala questioned to Narendra Modi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X