మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్: మనోజ్ తివారీపై కన్నయ్య కుమార్ పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ (Congress) పార్టీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా, ఆదివారం 10 మందితో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, కన్నయ్య కుమార్ లకు చోటీ దక్కింది.

ఆదివారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం.. కాంగ్రెస్ నేత, జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ను ఢిల్లీ నార్త్ ఈస్ట్ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. అలాగే చాందినీ చౌక్ నుంచి పార్టీ సీనియర్ నేత జేపీ అగర్వాల్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ పోటీ చేయనున్నారు.

Congress candidate list for LS polls Kanhaiya Kumar to contest against Manoj Tiwari in North East Delhi

మరోవైపు, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా పోటీ చేస్తున్నారు. జలంధర్(ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ, ఫతేగడ్ సాహిబ్(ఎస్సీ) నుంచి అమర్ సింగ్, భటిండా నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ, సంగ్రూర్ నుంచి ఆల్ ఇండియా కిసాన్ విభాగం చీఫ్ సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ బరిలో ఉన్నారు.

ఇక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుంచి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు ఒడిశా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 75 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+