ఆస్పత్రిలో సోనియా - కోవిడ్ సమస్యలు : నిలకడగా ఆరోగ్యం..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్వస్థతకు గురయ్యారు. దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా వెల్లడించారు. వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పది రోజుల క్రితం సోనియా రోనా బారిన పడ్డారు. ఆమె పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలు పడుతుందని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ఇదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కసులో సోనియా - రాహుల్ కు ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా, ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మరో మూడు వారాలు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 13న విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఈ నెల 23న ఈడీ ముందుకు వెళ్లేందుకు సోనియా డిసైడ్ అయ్యారు.

కరోనా బారిన పడిన సమయం నుంచీ ఆమె ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారని.. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక, రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో దీని పైన కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. సోనియా సూచనలతో పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే పలు పార్టీలకు చెందిన నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెల 15న మమతా 22 మంది నేతలతో ఢిల్లీలో ఇదే అంశం పైన సమావేశం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీలతో చర్చలు చేసి..అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్దిని బరిలోకి దించాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications