కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణొయ్‌పై బహిష్కరణ వేటు.. ఎందుకంటే..
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దిప్ బిష్ణొయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో అతనిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు పార్టీలో గల పదవులు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఉన్న ప్రత్యేక ఆహ్వానిత పోస్ట్ కూడా వెళుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నామని వివరించారు.
రాజ్యసభ ఎన్నికల్లో బిష్ణొయ్ జేజేపీ-బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి కార్తీకేయ శర్మకు ఓటు వేశారు. దీంతో అతనే స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిప విజయం సాధించారు. అక్కడ 31 ఓట్లు ఉంటే 29 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. దీంతో కార్తీకేయ శర్మ రెప్పపాటులో విజయం సాధించారు.

అంతకుముందు బిష్ణొయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలను పాములతో పోల్చారు. అయినప్పటికీ తాను వారితో పోరాడుతానని చెప్పారు. వాస్తవానికి బిష్ణొయ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఆశించారు. రాహుల్ గాంధీతో మీట్ అయ్యారు.. ఆ తర్వాత పదవీ వస్తోందని అనుకున్నారు. రాకపోవడంతో.. అసంతృప్తితో ఉన్నారు. అందుకే క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో అతనిని పార్టీ నుంచి బహిష్కరించారు.












Click it and Unblock the Notifications