కాంగ్రెస్ జీ 23 నేతల భేటీకి ముహూర్తం ఫిక్స్: మోడీ ఫ్రెండ్‌ పైనే ఫోకస్

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాయి. ఇప్పట్లో కోలుకోనివ్వకుండా చేశాయి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఆశించిన సీట్లు రాలేదు. కనీసం ప్రతిపక్ష స్థానానికి అవసరమైనన్ని సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. ఉన్నంతలో గోవాలో మాత్రమే ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది కాంగ్రెస్ ప్రస్థానం. కంచుకోటగా ఉంటూ వచ్చిన పంజాబ్‌ను పోగొట్టుకుంది.

పనిచేయని ఛరిష్మా..

పనిచేయని ఛరిష్మా..

ఒక వెలుగు వెలిగిన ఉత్తర ప్రదేశ్‌లో రెండు స్థానాలకే పరిమితమైంది. పార్టీ తురుఫుముక్కగా భావించిన ప్రియాంకాగాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తన భుజాన వేసుకున్నప్పటికీ.. ఏ మాత్రం ఆశించిన ఫలితాలను రాలేదు. ఆమె ఛరిష్మా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ముందు నిలవలేదు. పైగా సీట్ల సంఖ్యను మరింత తగ్గించింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను మసక బారేలా చేశాయడానికి నిలువెత్తు నిదర్శనాలు.

సీనియర్లలో అసంతృప్తి

సీనియర్లలో అసంతృప్తి

ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి, అసహనానికి దారి తీసింది. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించకపోవడం పట్ల ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా కూడా లేకుండా పోయింది. ఒక్క భారీ విజయం కోసం ముఖం వాచి పోయేలా ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్. ఎంతకాలం ఇలా పరాజయాలు వెంటాడుతాయనేది కూడా అర్థం కాని పరిస్థితిలో పడింది.

జీ 23 నేతల భేటీ రేపే..

జీ 23 నేతల భేటీ రేపే..

ఈ దారుణ పరాజయాలను సమీక్షించడానికి కాంగ్రెస్‌కు చెందిన జీ-23 నాయకులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. బుధవారం వారు సమావేశం కానున్నారు. నాయకత్వ మార్పిడి విషయంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవడం, సమర్థులైన బయటి నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలను ఈ సమావేశం అజెండాగా తీసుకున్నారు.

ఆజాద్ సహా..

ఆజాద్ సహా..

భూపీందర్ సింగ్ హుడా, రాజీందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, వివేక్ టంఖా, ఆనంద్ శర్మ, పీజే కురియన్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్‌రా, శశిథరూర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, కౌల్ సింగ్ ఠాకూర్, కుల్‌దీప్ శర్మ, యోగానంద్ శాస్త్రి ఉన్నారు. వీరంతా ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు.

ఆజాద్ ఏం చెబుతారు?

ఆజాద్ ఏం చెబుతారు?

కాగా- ఈ భేటీ సందర్భంగా అందరి దృష్టీ ఆజాద్ మీదే నిలిచింది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆజాద్ నుంచి ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యనాలు వస్తాయనేది ఆసక్తి రేపుతోంది. గులాంనబీ ఆజాద్‌- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు.. ఆప్తుడు. ఈ విషయం మోడీ స్వయంగా పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించారు.

ఆగస్టు 20న ఎన్నిక..

ఆగస్టు 20న ఎన్నిక..

నాయకత్వాన్ని మార్చాలంటూ ఇప్పటికే శశిథరూర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రమే ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. పార్టీ మళ్లీ విజయాలబాట పట్టాలంటే ప్రక్షాళన తప్పదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం రాజీనామాలు చేస్తుందంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. రాజీనామా ప్రతిపాదనలను రెండు రోజుల కిందటే సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తోసిపుచ్చింది. వచ్చే ఆగస్టు 20వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+