మారుతున్న లెక్కలు - గెలుపు దక్కేదక్కడే..!!
ఢిల్లీలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు ఆప్ ఇతర పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పూర్తిగా తమ ఎన్నికల హామీలైన గ్యారంటీల పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ ఈ సారి గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. కానీ, క్షేత్ర స్థాయి లో లెక్కలు మారుతున్నాయి. ఏ పార్టీ గెలవాలన్నా మహిళా - యువతతో పాటుగా సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి.
మారుతున్న లెక్కలు
ఢిల్లీ ఎన్నికల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మహిళా ఓటర్లే లక్ష్యంగా పార్టీలు ఇప్పటి కే హామీలు గుప్పించాయి. యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆప్ ఈ సారి ఢిల్లీలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీలో జోష్ పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఊహించని దెబ్బ తిన్న కాంగ్రెస్ కు ఢిల్లీ పోరు ప్రతి ష్ఠాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు లేకపోవటంతో తమకు కలిసి వచ్చే అంశం గా బీజేపీ భావిస్తోంది. ఆప్ పైన ప్రజల్లో నమ్మకం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. దీంతో, త్రిముఖ పోరు లో ప్రతీ సమీకరణం కీలకంగా మారుతోంది.

హామీల పైనే ఆశలు
ప్రధానంగా కాంగ్రెస్ తాము ఇచ్చిన గ్యారంటీల హామీల పైనే నమ్మకం పెట్టుకుంది. మహిళల కోసం 'ప్యారీ దీదీ యోజన'ను కాంగ్రెస్ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతినెలా రూ. 2,500 మహిళలకు ఆర్థిక సాయంగా ఇస్తామని హామీ ఇచ్చింది. దిల్లీ ప్రజల కోసం 'జీవన్ రక్ష యోజన' పైన అభయం ఇచ్చింది. దీని కింద రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ఇస్తామని పేర్కొంది. దిల్లీలోని నిరుద్యోగ యువత కోసం 'యువ ఉడాన్ యోజన'ను ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 8,500 చొప్పున ఒక ఏడాది పాటు ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా..
300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఉచిత రేషన్ కిట్‌ల పైన హామీలు గుప్పించింది.
త్రిముఖ పోటీలో
ప్రస్తుతం అందుతున్న క్షేత్ర స్థాయి సమాచారం మేరకు ఆప్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనగా- సత్తా చాటేందుకు కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎస్సీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఆశలు పెంచుకుంటోంది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ నిజాయితీ ని బీజేపీ ప్రశ్నిస్తోంది. అటు ఆప్ నేతలు సైతం ఇప్పటికే ఇంటింటి ప్రచారం తీవ్రతరం చేసారు. ప్రధాని మోదీ, అమిత్ షా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. దీంతో.. ఢిల్లీలో ఎవరు గెలవాలన్నా...మహిళల మద్దతు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications