వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఎన్సీపీ నేత శరద్‌పవర్ తోపాటు శివసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా ఉదయమే ఎన్సీపీ నేత శరద్‌పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. అనంతరమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడంతో మరోసారి మహా రాజకీయాలు యూ టర్న్ తీసుకున్నాయి.

సిద్దాంతపరంగా శివసేనకు వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారం నేపథ్యంలోనే ఒక్కటయ్యెందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సుదీర్ఘకాలం విమర్శలు చేసుకున్న మూడు పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అయితే మూడు పార్టీల మధ్యలో పొత్తులు కుదురుతున్న సంధర్భంలోనే శివసేనకు భారీ షాక్ తగిలింది.

Congress held separate meetings with Sharad Pawar and Shiv Sena

కాంగ్రెస్, ఎన్సీపీలతో అధికారాన్ని పంచుకోవడంపై శివసేన చేస్తున్న ప్రయత్నాలను ఆపార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిసి తమ అభిప్రాయాన్ని తెలుపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ పరిణామాలతో బీజేపీ సైతం పావులు కదుపుతుంది. పోత్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మహా రాజకీయాలు మరింత వెడెక్కాయి.

English summary
The Congress held separate meetings with Sharad Pawar of the Nationalist Congress Party (NCP) and the Shiv Sena this evening
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X