Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీకి భారీ ఊరట- మోదాని మోడల్

పీఎన్‌బీలో వేల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీకి ఊరట లభించింది. రెడ్ కార్నర్ నోటీస్ నుంచి ఆయన పేరును ఇంటర్ పోల్ తొలగించింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటోన్నాయి.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీకి భారీ ఊరట లభించింది. ఇదివరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ నుంచి ఆయన పేరును తొలగించింది. దేశం విడిచి పారిపోయిన ఓ నేరస్తుడు ప్రపంచంలో మరెక్కడికీ ప్రయాణించడానికి వీల్లేకుండా ఇంటర్ పోల్ జారీ చేసే- రెడ్ కార్నర్ నోటీస్ ఇది.

ఈ నోటీసుల జాబితాలో నుంచి మేహుల్ చోక్సీ పేరును ఇంటర్ పోల్ తొలగించింది. దీనితో ఆయన ఎక్కడికైనా రాకపోకలు సాగించే వీలు కలిగినట్టయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే ఇంటర్ పోల్- ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని బలపరిచేలా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తోన్నాయి. కేంద్రం అభ్యర్థన మేరకే మేహుల్ చోక్సీపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీస్ ను ఇంటర్ పోల్ తొలగించిందని విమర్శిస్తోన్నాయి.

 Congress hit out at the Centre over Mehul Choksis name removal from the Interpol Red Corner Notices

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 13,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన మేహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కరేబియన్ ద్వీపదేశం అంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్నారు. 2017లో వారికి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉండటం వల్ల మేహుల్ చోక్సీని భారత్‌కు తీసుకుని రావడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు.

తాజాగా- ఇంటర్ పోల్ తీసుకున్న నిర్ణయంతో మేహుల్ చోక్సీ ఇక ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వీలు ఏర్పడినట్టయింది. అరెస్ట్ చేస్తారనే కారణంతో భారత్ కు రాలేకపోవచ్చు. ఇదివరకు కిడ్నాప్ అయినట్లు భావించిన మేహుల్ చోక్సీ డొమినికాలో తేలారు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో ఆయనకు జైలుశిక్ష విధించిందా దేశం. రెడ్ కార్నర్ నోటీస్ తొలగిపోయిన నేపథ్యంలో ఇప్పుడలాంటి పరిస్థితులను చోక్సీ ఎదుర్కొనకపోవచ్చు.

ఈ వ్యవహారం పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇదంతా మోదీ ప్లస్ అదాని మోదాని మోడల్ లో భాగమేనంటూ ధ్వజమెత్తుతున్నాయి. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ఇష్టానుసారంగా ప్రయోగిస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం- ఆర్థిక నేరస్తులను మాత్రం స్వేచ్ఛగా వదిలిపెడుతోందంటూ భగ్గుమంటోన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా పలువురు విపక్ష నాయకులు దీన్ని తప్పుపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+