వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేణుగోపాల్‌పై దురుసు ప్రవర్తన, చిరిగిన చొక్కా, స్టేషన్‌లోనే కేసీ, ప్రియాంక గాంధీ ఆగ్రహం (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఈడీ విచారణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. దానిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నిరసనలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఢిల్లీ స‌హా దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆందోళ‌న‌ల‌కు దిగిన కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కీలక నేత కేసీ వేణుగోపాల్‌పై ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.

వేణుగోపాల్‌తో ఇలా..

వేణుగోపాల్‌తో ఇలా..


ఢిల్లీలో ఈడీ కార్యాల‌యం ముందు కేసీ వేణుగోపాల్ నిర‌స‌న‌కు దిారు. ఆయనను అరెస్ట్ చేసి తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు ఈడ్చుకెళ్లిన‌ట్లుగా తీసుకెళ్లారు. ఆయనను తీసుకెళ్లే విజువల్ స్పష్టంగా కనిపించింది. ఆయన చోటా, మోటా నాయకుడు కాదు.. కానీ అతని పట్ల ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. అయితే పెనుగులాట‌లో ఆయ‌న చొక్కా చిరిగిపోయింది.

స్టేషన్‌లోనే నేత

స్టేషన్‌లోనే నేత


పోలీసులు త‌నతో దురుసుగా వ్య‌వ‌హ‌రించడంతో కేసీ వేణుగోపాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అరెస్ట్ చేసిన నేత‌ల‌ను విడుదల చేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. పోలీసుల వైఖ‌రిని నిరసిస్తూ వేణుగోపాల్ పీఎస్‌లోనే దీక్ష‌కు దిగారు. విష‌యం తెలుసుకున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ నేరుగా తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు.

ప్రియాంక ఫైర్

ప్రియాంక ఫైర్


చొక్కా చిరిగిన స్థితిలో క‌నిపించిన వేణుగోపాల్‌ను చూసిన ప్రియాంకా గాంధీ పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ రాజ‌కీయ‌ నేతలతో ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అని పోలీసుల‌పై ఫైర‌య్యారు. నిజమే.. సీనియర్ నేతలతో పోలీసులు కాస్త హుందగా ప్రవర్తిస్తే బాగుండేది. ఆయనను తీసుకెళ్లే సమయంలో.. చొక్కా చిరిగింది. నిజానికి దురుసుగానే తీసుకెళ్లారు. సదరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది కూడా.. దీనిపై దుమారం రెగే అవకాశం ఉంది.

English summary
Senior Congress leader and Rajya Sabha MP KC Venugopal was manhandled by the Delhi Police. priyanka gandhi angry on police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X