కారు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మానవేంద్ర సింగ్ భార్య మృతి, ఆయనకు తీవ్ర గాయాలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మానవేంద్ర సింగ్ (Manvendra singh) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన సతీమణి చైత్రా సింగ్ ఘటనా స్థలంలోన మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అళ్వార్‌లో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కారులో ఉన్న మాజీ ఎంపీ కుమారుడు సోలంకి సింగ్, డ్రైవర్‌కు గాయలయ్యాయి. ప్రమాద సమయంలో మానవేంద్ర సింగ్ కారు నడిపినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తుండగా వాహనం ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి దివంగత జశ్వంత్ సింగ్ పెద్ద కుమారుడే మానవేంద్ర సింగ్.

2004లో రాజస్థాన్‌లోని బాడ్మే్ర్-జైసల్మేర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా, 2013లో శెవో స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు గానూ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, రోడ్డు ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చైత్రా సింగ్ మృతి పట్ల ఆమె సంతాపం తెలిపారు. పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మాజీ ఎంపీ మానవేంద్ర సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications