సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

కేంద్రంలో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను నిర్ధారించడానికి ఆధార్ కార్డుకు బదులు ఓటర్ ఐడీని ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందించారు.

మోడీ ప్రభుత్వ మంత్రి తన ప్రకటనలో పథకాల ప్రయోజనాలు ఇకపై ఆధార్‌తో కాకుండా ఓటర్ ఐడీతో నిర్ణయిస్తారని చెప్పటం ఒక కుట్ర అని, ఇది చాలా చాలా తీవ్రమైన నిర్ణయం అవుతుందని అన్నారు. కాస్త సమయం కేటాయించి ప్రజలు ఈ కుట్రను అర్థం చేసుకోండి అని రాహుల్ ట్వీట్ చేశారు. ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో లక్షలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఇంకా మరిన్ని పేర్లు తొలగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Congress leader Rahul Gandhi Accuses BJP of Linking Welfare Benefits to Voter ID - Calls it Rights Theft

పేరు తొలగిస్తే ఓటు పోయినట్లే. ఓటు పోతే హక్కులు పోయినట్లే. మీరు హైజాక్ చేసిన ప్రజాస్వామ్యంలో అదృశ్య పౌరులుగా మారిపోతారన్నారు. ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు.. ప్రభుత్వమే తనకు అనుకూలమైన వ్యక్తులను ఎన్నుకుంటోంది అని రాహుల్ విమర్శించారు. ఓటర్ల జాబితాలు నిష్పక్షపాత ఎన్నికల సంఘం చేతిలో ఉండాల్సింది కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్ కుమార్ చేతిలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.

కేంద్ర మంత్రి లలన్ సింగ్ వీడియోలో .. ఇకపై లబ్ధిదారులకు చెల్లింపులకు ఆధార్ కార్డు ప్రాతిపదిక కాదు. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి వీధిలో అందుబాటులో ఉంది. అడిగితే ఐదు నిమిషాల్లో సిద్ధం చేస్తారు. కాబట్టి ఆధార్ కాదు. లబ్ధిదారులందరికీ బయోమెట్రిక్, ఓటర్ ఐడీ ఎపిక్ నంబర్ ప్రాతిపదికగా ఉంటాయన్నారు. వాటి ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.

దీంతో రాహుల్ గాంధీ ఇది వచ్చే ఎన్నికలు గెలవడానికి చేస్తున్న రాజకీయం కాదు. ఎన్నికలనే పూర్తిగా హైజాక్ చేసి శాశ్వతంగా అధికారంలో ఉండే ఏర్పాటు అని ఆరోపించారు. పేదవాడి పెన్షన్‌ను ఓటర్ కార్డుకు బానిస చేయలేం అని స్పష్టం చేశారు. ఇది కేవలం ఓటు చోరీ కాదు.. హక్కుల చోరీ. తాము అలా జరగనివ్వమని చెప్పారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆపై గోనెసంచిలో మూట కట్టి..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆపై గోనెసంచిలో మూట కట్టి..

ప్రస్తుతం ఆధార్ కార్డు అనేక కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు ప్రధాన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతోందన్నారు. పింఛన్లు, రేషన్, ఉపాధి హామీ, ఇళ్ల పథకాలు వంటి వాటిలో ఆధార్ లింక్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఓటర్ ఐడీని ప్రాతిపదికగా తీసుకుంటే, ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి పథకాల ప్రయోజనాలు దక్కకపోవచ్చని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది పేర్లు తొలగించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+