NEET 2024: నీట్ పై లోక్ సభలో రగడ.. ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ..
సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్ అంశంపై మాట్లాడారు.విద్యావ్యవస్థను నాశనం చేశారంటూ విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీలో రికార్డ్ సృష్టించారంటూ ఎద్దేవా చేశారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని.. దీనికి విద్యాశాఖ మంత్రితో సహా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ భాధ్యతగా రిజైన్ చేయాలన్నారు. "నీట్‌లోనే కాకుండా అన్ని ప్రధాన పరీక్షల్లోనూ మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని దేశం మొత్తానికి స్పష్టంగా అర్థమైంది. మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) తనను తప్ప అందరినీ నిందించారని అన్నారు. అతను ఇక్కడ ఏమి జరుగుతుందో దాని ప్రాథమికాలను అర్థం చేసుకున్నాడని కూడా నేను అనుకోను" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పేపర్ లీక్ మరియు వాట్సాప్ ద్వారా 'లీక్ అయిన ప్రశ్నపత్రం' వ్యాప్తిని అంగీకరించిందన్నారు.

నీట్ పరీక్ష ఫలితాలపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివ్లా మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రాల వారీగా, నగరాల వారీగా పరీక్ష ఫలితాలు ప్రకటించాలని ఆదేశించారు. 4,750 కేంద్రాల నుంచి 23 లక్షల మంది అభ్యర్థుల భారీ డేటా సంచిత ఫార్మాట్‌లో కాకుండా ప్రతి కేంద్రానికి డ్రాప్-డౌన్ మెనూలో విడుదల చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష విధిపై తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నందున అక్రమాలకు సంబంధించిన అనేక పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డేటా విడుదల చేశారు.
నగరాల వారీగా, పరీక్ష కేంద్రాల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో రాజస్థాన్ లోని సికర్ నగరం రికార్డు సృష్టించింది. నగరాల వారీగా, పరీక్ష కేంద్రాల వారీగా ప్రకటించిన నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్ లోని సికర్ లో పరీక్ష రాసిన అభ్యర్ధులందరూ ఏకంగా 600, 650 మార్కులు సాధించారు. సికర్ నగరంలో ఉన్న ప్రతీ పరీక్ష కేంద్రంలో ఇలా భారీ సంఖ్యలో అభ్యర్ధులు 600 నుంచి 650కు పైగా మార్కులు సాధించినట్లు తాజా పరిశీలనలో వెల్లడయింది. దీంతో నీట్ పరీక్షపై ఆందోళనలు కొనసాగుతోన్నాయి.












Click it and Unblock the Notifications