బీజేపీ పాలనలోనే మూక హత్యలు.. మోదీపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
ప్రధాని మోదీ పాలనపై మరో సారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజలకు రఓణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి మూక హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు బీజేపీ పాలనకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు

మోదీ పాలనలో మూక హత్యలు
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఘటనలపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధానిగా మోదీ పై మండిపడ్డారు. 2014కి ముందుకు మూక హత్యల ఘటనల గురించి వినేవారం కాదని పేర్కొన్నారు. మోదీ పాలన కొలువు తీరక ముందు మూకదాడుల మాటే వినలేదు థ్యాంక్యూ మోదీజీ అంటూ రాహుల్ గాంధీ ట్విట్ చేశారు.

రాహుల్ గాంధీకి బీజేపీ నేతల కౌంటర్
రాహుల్ గాంధీ ట్విట్ పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మూక హత్యలకు రాహుల్ తండ్రి లాంటి వాడంటూ మండిపడ్డారు. బీజేపీకి నీతులు చెప్పాల్సిన పనిలేదన్నారు. గతంలో జరిగిన సిక్కుల ఊచకోతను కాంగ్రెస్ సమర్థించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సిక్కుల మెడకు కాలుతున్న టెర్లను చుట్టిందని విమర్శించారు. కాల్వల్లో పడేసిన దగ్ధమైన డెడ్ బాడీలను కుక్కులు పీక్కుతిన్నాయని బీజేపీ నేతల మాలవీయ దుయ్యబట్టారు. నాడు జరిగిన మారణహోమం ఇప్పటికీ చేదు జాపకంగా మిగిలి ఉందన్నారు.

ప్రార్థనాలయాలను అపవిత్రం చేసేవారిని ఉరితీయాలి
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో ఇటీవల రెండు మూక దాడులు జరిగాయి. సిక్కుల ప్రార్థనాలయాను అపవిత్రం చేశారని ఇద్దరు వ్యక్తులను పట్టుకొని కొట్టిచంపారు. ఈ ఘటన జరిగిన అనంతరం రాహుల్ గాంధీ మోదీ పాలనను విమర్శిస్తూ ట్విట్ చేయడం చర్చనీయాంశమైంది. అటు పంజాబ్ నేతలు ఈఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రార్థనాలయాలను అపవిత్రం చేసేవారిన బహిరంగంగా ఉరితీసినా పాపం లేదని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications