వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు కోసం, మంత్రి పదవీకి తండ్రి త్యాగం : హిమాచల్ సీఎం ఆదేశంతో అనిల్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ హుకుంతో ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అనిల్ శర్మ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ, మంత్రి పదవీకి రాజీనామా చేశారు. మంది లోక్ సభ స్థానం నుంచి అనిల్ కుమారుడు ఆశ్రయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా మంది తప్ప మిగతా చోట్ల బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని అనిల్ .. బీజేపీకి, సీఎంకు స్పష్టంచేశారు. కానీ నిన్న ఓ సభలో సీఎం జై రామ్ ... మందిలో ప్రచారం చేయాలి, లేదంటే పదవీనుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీచేయడంతో .. పదవీకి రాజీనామా చేశారు అనిల్.

Congress leader Sukh Rams son resigns from Himachals BJP govt

కొడుకు కోసం మంత్రి పదవీకి రాజీనామా
హిమాచల్ ప్రదేశ్ కి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పండిత్ జీ కుమారుడే అనిల్ శర్మ. పండిత్ జీ .. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మారిన రాజకీయ సమీకరణాలతో అనిల్ .. బీజేపీలో చేరి, మంత్రిగా పనిచేస్తున్నారు. మంది నుంచి సిట్టింగ్ ఎంపీ రాం స్వరూప్ శర్మ బరిలోకి దిగారు. ఆశ్రయ్ కు టికెట్ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో అనిల్‌పై ఒత్తిడి పెరిగింది. నిన్న జై రామ్ ఠాకూరు వ్యాఖ్యలతో అది పీక్ స్టేజీకి చేరింది. తేగే దాక లాగడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ అనిల్ తన మంత్రి పదవీ రాజీనామా చేశారు.

మంత్రిని కాదు ... బీజేపీ ఎమ్మెల్యే

తన మంత్రి పదవీకి రాజీనామా చేశాక .. అనిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ .. ఇప్పుడు తాను బీజేపీ ఎమ్మెల్యేనని స్పష్టంచేశారు. ఓ బీజేపీ కార్యకర్త పనిచేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. కానీ మంది నుంచి మాత్రం బీజేపీ తరఫున ప్రచారం చేయబోనని మరోసారి స్పష్టంచేశారు.

English summary
Himachal Pradesh Power Minister Anil Sharma resigned from the state's Bharatiya Janata Party (BJP) government on Friday, days after the Congress fielded his son Aashray Sharma as its candidate from the Mandi Lok Sabha constituency. Anil Sharma has been under pressure from his own party after his father, former Union minister Sukh Ram quit the BJP and joined the Congress along with Aashray Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X