తగ్గేదే లే, నడుంలో రివాల్వర్ పెట్టుకుని ఓపెన్ టాప్ వాహనం ఎక్కి సీఎంకు సన్మానం, రౌడీరాజ్యం అని !
కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వానికి చుక్కలు చూపించాలనే ప్లాన్ తో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ 25 చోట్ల, జేడీఎస్ మూడు చోట్ల పోటీ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంది. ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యం సీఎం సిద్ధరామయ్య ఏప్రిల్ 8వ తేదీ సోమవారం బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి తరపున సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జయనగరతో పాటు ఆ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీని నడుంలో చెక్కుకుని సీఎం నిలబడి ఉన్న బహిరంగ వాహనంలోకి ఎక్కి సీఎం సిద్దరామయ్యతో పాటు ఎంపీ అభ్యర్థి సౌమ్యా రెడ్డికి పూలమాల వెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి తరపున సీఎం సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పూలమాల వేసి సన్మానించే వారు పోకిరీలు, రౌడీలు, వీధి గూండాలు అని మరోసారి రుజువు అయ్యిందని బీజేపీ ఆరోపించింది.
ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ಅವರಿಗೆ ಹಾರ ಹಾಕುವವರು ಸನ್ಮಾನ ಮಾಡುವವರು ಗೂಂಡಾಗಳು, ರೌಡಿಗಳು, ಬೀದಿ ಪುಂಡರು ಎನ್ನುವುದು ಸಾಬೀತಾಗಿದೆ.
— BJP Karnataka (@BJP4Karnataka) April 8, 2024
ಇಷ್ಟುದಿನ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಫ್ಲೆಕ್ಸ್ಗಳಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತಿದ್ದ ಗನ್ ಹಿಡಿದ ರೌಡಿಗಳು, ಇದೀಗ ಸಿಎಂ, ಡಿಸಿಎಂ ಅವರ ರ್ಯಾಲಿಗಳಲ್ಲಿ ರಾಜಾರೋಷವಾಗಿ ಗನ್ ಹಿಡಿದು ಹಾರ ಹಾಕಿ ಸಮಾಜದ ಮುಂದೆ ಪೋಸ್… pic.twitter.com/r9paiEgw15
ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. ఇంతకాలం బర్త్ డే ఫ్లెక్సీల్లో కనిపించిన తుపాకీ పట్టుకుంటున్న రౌడీలు ఇప్పుడు సీఎం, డీసీఎంల ర్యాలీల్లో, ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా తుపాకులు పట్టుకుని పూలమాలలు వేసే స్థాయికి వచ్చేశారని, తుపాకులు పట్టుకుని పబ్లిక్ గా సొసైటీ ముందుకు వచ్చి ఫోజులిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే కాంగ్రెస్ నాయకులు, రౌడీలు ఇలా నడుంలో తుపాకులు పట్టుకుని ఇలా ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్‌పై ప్రతిపక్ష పార్టీ బీజేపీ సోషల్ మీడియాలో విరుచుకుపడింది.
అయితే ఈ విషయంలో సీఎం సిద్దరామయ్యతో పాటు మంత్రి రామలింగా రెడ్డి, బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ స్పందించలేదు. మొత్తం మీద సీఎం సిద్దరామయ్య ఉన్న వాహనం మీదకు ఓ వ్యక్తి నడుంలో తుపాకి పెట్టుకుని వెళ్లి సీఎంకు స్వయంగా పూలహారం వెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది. అతను తుపాకి పెట్టుకుని సీఎం, మంత్రి ఉన్న వాహనంలోకి ఎక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications