హోమ్ మంత్రి అమిత్ షా మీద ఎఫ్ఐఆర్, బెదిరిస్తారని కేసు పెట్టిన టాప్ లీడర్స్ !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే కచ్చితంగా కర్ణాటకలో గొడవలు జరుగుతాయని, లేనిపోని అల్లర్లు జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మీద బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ జీ. పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కలిసి బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ నెంబర్ టూ లీడర్ అమిత్ షా మీద ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు అమిత్ షా మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

 fironamit-

ప్రజలను రెచ్చగొట్టేలా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారని. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసి బీజేపీకి ఓటు వెయ్యాలని వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు మనవి చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

కర్ణాటకలోని బెళగావిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కార్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లేనిపోని గొడవలు జరుగుతాయని. పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందుకే ఆ పార్టీలకు ఓట్లు వెయ్యకూడదని బహిరంగ సభలో చెప్పారు.

ಎಐಸಿಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದ @rssurjewala, ಕೆಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರಾದ @DKShivakumar ಅವರು, ಕಾಂಗ್ರೆಸ್ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದರೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಿಂಸಾಚಾರ ನಡೆಯುತ್ತದೆ ಎಂದು ರಾಜ್ಯದ ಮತದಾರರಿಗೆ ಬೆದರಿಕೆ ಒಡ್ಡಿರುವ ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವ @AmitShah ಅವರ ವಿರುದ್ಧ ಬೆಂಗಳೂರಿನ ಹೈ ಗ್ರೌಂಡ್ಸ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಸಲ್ಲಿಸಿದರು. pic.twitter.com/wi9Z6rzxgL

— Karnataka Congress (@INCKarnataka) April 27, 2023 tter.com/widgets.js" charset="utf-8">

బహిరంగ సభలో మాట్లాడిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యర్థి పార్టీలకు ఓటు వెయ్యకూడదని, ఓటు వేస్తే గొడవలు జరుగుతాయని ఓటర్లను బెదిరించారని, ఇలా రెండు వర్గాల మధ్య మనరస్పర్థలు రావడానికి, ప్రజల్లో భయం పుట్టించడానికి అమిత్ షా ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరులో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రివర్స్ గేర్ పాలన మొదలౌతుందని, జేడీఎస్ పార్టీకి ఓటు వేస్తే కుటుంబ రాజకీయాలు అమలు అవుతాయని, మీరు అలా చెయ్యకుండా బీజేపీకి ఓటు వెయ్యాలని కేంద్ర మంత్రి అమిత్ షా కన్నడిగులకు మనవి చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+