ఆ మాజీ సీఎంకు ఆయన ప్యాంట్ కింద డ్రాయర్ విషయం మరిచిపోయారు, మంత్రి ఫైర్!
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ముస్లిం సమాజాన్ని మొదటి నుంచి ద్వేషిస్తున్నారని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తు చర్చలపై సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రి సీఎం ఇబ్రహీంను జేడీఎస్‌లోకి తీసుకెళ్లి నామ్‌కా వాస్తే పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిని చేసి అవమానించారని జమీర్ అహ్మద్ ఆరోపించారు.
ఇబ్రహీంకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని, అందుకు కారణం మాజీ సీఎం కుమారస్వామికి మొదటి నుంచి ముస్లిం సమాజం అంటే ద్వేషమని జమీర్ అహ్మద్ అన్నారు. జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో జమీర్ అహ్మద్ మంత్రి కాలేదా? అని ఎం. ఫరూక్ చేసిన ఆరోపణలకు మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్పందించారు. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తానకు కుమారస్వామి నాకు కేవలం మంత్రి పదవి ఇచ్చి వక్ఫ్, హజ్ శాఖలను మాత్రమే కేటాయించారని జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.

అందుకే తాను జేడీఎస్ పార్టీ వదిలేసి బయటకు వచ్చానని జమీర్ అహ్మద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు గతసారి నాలుగు శాఖలు, ఇప్పుడు మూడు బలమైన శాఖలు ఇచ్చాని, అదే మాజీ సీఎం కుమారస్వామికి, కాంగ్రెస్‌కు ఉన్న తేడా అని జమీర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. ఇప్పుడు ఫరూక్‌పై ప్రేమ చూపిస్తున్న కుమారస్వామి 2018లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు జేడీఎస్ ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని జమీర్ అహ్మద్ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే ముస్లిం వర్గాన్ని ఉపముఖ్యమంత్రిని, హోమ్ మంత్రిని చేస్తానని కుమారస్వామి చెప్పారు. మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నప్పటికీ ఫరూక్‌కు మంత్రి పదవి దక్కలేదని, రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పుడు రామస్వామికి, కుపేంద్రరెడ్డిని అభ్యర్థిగా చేశారుని, ఓటమి సమయంలో తనకు టిక్కెట్ ఇచ్చి కాంగ్రెస్‌లో గుడ్లగూబలా కూర్చోబెట్టారని ఫరూక్ మీద మండిపడ్డారు.
హిజాబ్, హజాన్, హలాల్ సమస్యను తీసివేసి ముస్లిం సమాజం పట్ల బీజేపీ ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు. దీన్ని ఫరూక్ ఎలా సమర్థించి బీజేపీ కూటమికి అంగీకరిస్తాడో తనకు అర్థం కావడంలేదని, ముస్లీం. సమాజం అంతా గమనిస్తోందని జమీర్ అహ్మద్ అన్నారు. బీజేపీతో జేడీఎస్ పొత్తు వల్ల రామనగర్, చెన్నపట్టణ, హాసన్ మండ్యతో పాటు కర్ణాటకలోని ముస్లీంలు అందరూ జేడీఎస్ కు దూరం అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications