ప్రియాంకను ట్యాగ్ చేసి పప్పులో కాలేసిన కాంగ్రెస్: నెటిజన్ల సెటైర్లతో డిలీట్

న్యూఢిల్లీ: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మరోసారి పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక ఛతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది.

భూ పరీక్షల ల్యాబ్‌ల గురించి ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్‌ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ట్వీట్ చేసి ప్రియాంకకు ట్యాగ్ చేసింది.

 Congress mistakenly tags Priyanka Chopra instead of its spokesperson, deletes tweet

యూపీఏ హయాంలో 1141 భూ పరక్షా కేంద్రాలు ఉన్నట్లు చెబుతూ ప్రియాంక ఛతుర్వేది ట్యాగ్ చేయబోయి, ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. దీంతో ట్విట్టర్‌లో కాంగ్రెస్‌పై నెటిజన్లు జోకులు పేల్చారు.

వెంటనే తన పొరపాటును తెలుసుకున్న కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఐదేళ్ల కిందట ప్రధాని మోడీ మాట్లాడిన వీడియోను పోస్టు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+