వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలు తాగరా! మద్యం తాగి వాహనం నడిపితే తప్పా? అరెస్ట్ చేస్తారా?: పీఎస్‌లో ఎమ్మెల్యే ధర్నా

|
Google Oneindia TeluguNews

జైపూర్: చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు.. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే తప్పేంటి? అంటూ పోలీసులనే ప్రశ్నించారు. అంతేగాక, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టైన తమ బంధువును విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ దంపతులు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Congress MLA, husband stage dharna in police station against arrest of nephew for drunk driving

'ఈరోజుల్లో పిల్లలందరూ మద్యం తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి? అదేమంత పెద్ద విషయం కాదు. నా మేనల్లుడిని తక్షణమే విడుదల చేయండి' అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిందితుడిని విడిచిపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్, తన భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే దర్నాకు దిగారు. అనంతరం ఉమైద్ సింగ్ కొందరు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. అంతేగాక, నిన్ననే కొందరు పోలీసులు ఈ పోలీస్ స్టేషన్ నుంచి సస్పెండ్ అయిన సంగతి మరిచిపోయారా? అంటూ పోలీసులను హెచ్చరించారు.

కాగా, ఈ తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో లా అండ్ ఆర్డర్ ఇలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధే ఇలా చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంత అధ్వాన్నంగా ఉందా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

కేంద్రంతో ఏపి సీఎం కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేసిన వీహెచ్ || Oneindia Telugu

కాగా, ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. అయితే డీసీపీ జోక్యం చేసుకోవడంతో సీజ్ చేసిన ఎమ్మెల్యే మేనల్లుడి కారును పోలీసులు తిరిగి అప్పగించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో, వాటిని నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Congress MLA, husband stage dharna in police station against arrest of nephew for drunk driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X