కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీజేపీకి సినిమా, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎలా !

Recommended Video

    R V Deshpande To Be Pro-Tem Speaker In Karnataka Legislative Assembly

    బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి 104 మంది శాసన సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ప్రభుత్వాన్ని బలపరీక్షలో నిలబెట్టుకోవాల్సి ఉంది. అయితే బీఎస్. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవడానికి శాసన సభలో స్పీకర్ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తాత్కాలిక స్పీకర్ ఎవరు ? ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారా అనే చర్చ ఇప్పుడు మొదలైయ్యింది.

    బీజేపీ మెజారిటీ

    బీజేపీ మెజారిటీ

    కర్ణాటక శాసన సభ సమావేశం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మెజారిటీ శాసన సభ్యుల మద్దతు చూపించాలి. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    స్పీకర్ కీలకం

    స్పీకర్ కీలకం

    బీఎస్. యడ్యూరప్ప అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే సమయంలో స్పీకర్ కీలక పాత్రపోషిస్తారు. ప్రస్తుతానికి కర్ణాటకకు స్పీకర్ ఎవరూ లేరు. కర్ణాటకకు తాత్కాలిక స్పీకర్ ను ఏర్పాటు చేసిన తరువాత బీఎస్ యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంటుంది.

    స్పీకర్ ఎన్నిక

    స్పీకర్ ఎన్నిక

    సీఎంగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెయ్యడం సవ్వంగానే జరిగిపోయినా ఇప్పుడు కర్ణాటక తాత్కాలిక స్పీకర్ బీజేపీకి సహకరిస్తారా అనే ప్రశ్న మొదలైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ శాసన సభ్యులు అందరూ కలిసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

    గవర్నర్ అనుమతి

    గవర్నర్ అనుమతి

    కర్ణాటక తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయంపై ఇప్పుడు తారాస్థాయిలో చర్చజరిగింది. కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా ఎవర్ని నియమించాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గవర్నర్ కు లిఖితపూర్వకంగా లేఖ రాసి తాత్కాలిక స్పీకర్ నియమకానికి అనుమతి తీసుకోవాలి.

    సీనియర్ ఎమ్మెల్యే

    సీనియర్ ఎమ్మెల్యే

    చట్టప్రకారం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేని తాత్కాలిక స్పీకర్ గా నియమించే అవకాశం ఉంది. అలా సీనియారిటీ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్.వీ. దేశేపాండ్ ఉన్నారు. ఆర్ వీ. దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్ అయితే యడ్యూరప్ప మెజారిటీ నిరూపించుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

    112 మంది ఎమ్మెల్యేలు

    112 మంది ఎమ్మెల్యేలు

    కర్ణాటక అసెంబ్లీలో 222 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 104 మంది, కాంగ్రెస్, జేడీఎస్ కు కలిపి 116 మంది, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్పారు. బలపరీక్షలో బీఎస్. యడ్యూరప్ప నెగ్గాలంటే 112 మంది ఎమ్మెల్యేలు అవసరం.

    ఆర్ వీ దేశ్ పాండ్

    ఆర్ వీ దేశ్ పాండ్

    కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్ వీ దేశ్ పాండ్ పేరును తాత్కాలిక స్పీకర్ గా గవర్నర్ కు సిఫారస్సు చేసింది. గవర్నర్ అనుమతి ఇస్తే ఆర్ వీ. దేశ్ పాండ్ తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీకి ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు కావాలి. బలపరీక్ష నిరూపించుకునే సమయంలో బీఎస్ యడ్యూరప్పకు తాత్కాలిక స్పీకర్ ఆర్ వీ. దేశ్ పాండ్ ఎలా సహకరిస్తారో అనే ప్రశ్న ఇప్పుడు మొదలైయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+