అమిత్ షా ఫేక్ వీడియో: కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ, ఆప్ నేత అరెస్ట్
అహ్మదాబాద్: రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లు ఉన్న నకిలీ వీడియోలు వైరల్ చేయడంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా నకిలీ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలతో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సహాయకుడిని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. బనస్కంతాకు చెందిన సతీశ్ వన్సోలా, దాహోద్ జిల్లాకు చెందిన రాకేశ్ బరియాను మంగళవారం అరెస్ట్ చేసింది. వీరిలో సతీశ్.. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వద్ద పీఏగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు, రాకాశ్ గత నాలుగేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎడిట్ చేసిన వీడియో వీరిద్దరికీ వాట్సాప్‌లో వచ్చింది. దాన్ని వారు ఉద్దేశపూర్వకంగానే ఫేస్‌బుక్ పేజీల్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఎవరు ఎడిట్ చేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అయితే, తన పీఏ అరెస్టుపై ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ స్పందిస్తూ.. బీజేపీ ఐటీ విభాగం చాలా కాలంగా నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తోంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సతీశ్ పొరపాటుగానే ఆ వీడియోను షేర్ చేశారని చెప్పుకొచ్చారు.
కాగా, ఏప్రిల్ 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేసిన నకిలీ వీడియోలను కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయడంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications