వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత అందుకే ఓడింది, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కవిత ఖర్గేతో మాట్లాడరని ధర్మపురి అర్వింద్ అనడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. అర్వింద్ ఇంటి మీద దాడి వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇరు పార్టీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా దూరింది. అసలు కవిత ఎలా ఓడిపోయిందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది.

సొంత పార్టీ నేతలే వెన్నుపోటు..

సొంత పార్టీ నేతలే వెన్నుపోటు..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటమికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఆమె సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని అన్నారు. కవిత గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఆమెను ఓడించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ఎద్దేవా చేశారు.

బీజేపీయే ఆ పనిచేసింది

బీజేపీయే ఆ పనిచేసింది

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీయేనని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేయిస్తే వారు బీజేపీలో ఎందుకు చేరుతారని అడిగారు. మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇలా కామెంట్ చేశారు. ప్రెస్ మీట్‌లో కవిత పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని కామెంట్ చేశారు.

అందుకే ఓటమి

అందుకే ఓటమి

కవితకు సొంత పార్టీ నేతలే సహకరించలేదని జీవన్ రెడ్డి అన్నారు. అందుకే ఆమె ఓడిపోయారని వివరించారు. ఆ సమయంలో ధర్మపురి అర్వింద్ తొలిసారి పోటీకి దిగారు. చెరకు రైతుల కోసం పాదయాత్ర చేపట్టి.. జనాలను ఆకర్షించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ప్రాంత ప్రజల్లో స్థానం సంపాదించారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం అదీ మరచిపోయారు. ఇంకేముంది ఎక్కడికి వెళ్లినా నిరసన సెగ మాత్రం తప్పడం లేదు. అందుకే పోలీస్ బందో బస్త్‌తో వెళ్లే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అర్వింద్‌కు విశ్వసనీయత ఉండదని చాలా మంది అంటున్నారు. ఇక్కడి ప్రజలు మాత్రం గట్టి గుణపాఠం చెబుతారని కొందరు కామెంట్ చేశారు.

English summary
congress party mlc jeevan reddy made hot comments on kavitha defeat in last lok sabha elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X