26 ఏళ్లకే ఎంపీ టిక్కెట్, 30 ఏళ్ల యువతులు ఎంతమంది ?, లక్కీ మృణాల్, యువరాజు స్కెచ్ తో !
కర్ణాటకలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. గురువారం కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కావడంతో అప్పుడు అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోక్ సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. 17 మంది అభ్యర్థుల జాబితాలో యువ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది మంది కొత్తవారిని రంగంలోకి దించగా, వీరిలో ఎక్కువ మంది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే కావడం విశేషం. అలాగే బీదర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 26 ఏళ్ల యువకుడికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చింది. మంత్రి ఈశ్వర్ ఖండ్రే తనయుడు సాగర్ ఖండ్రే (26 )కి హైకమాండ్ ఎంపీ టిక్కెట్టు ఇచ్చి అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

కర్ణాటక రాష్ట్రంలో రెండు దశల్లో అంటే ఏప్రిల్ 26వ తేదీ, మే 7వ తేదీ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులలో బీదర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి అతి పిన్న వయస్కుడు సాగర్ ఖండ్రేగా రికార్డులకు ఎక్కాడు. ఇక మంత్రి సతీష్ జారకిహోళి కుమార్తె ప్రియాంక సతీష్ జారకిహోళి, సాగర్ ఖండ్రే ఇద్దరూ 1997లో జన్మించారు.
అయతే ఏప్రిల్‌లో ప్రియాంక జన్మించినందున డిసెంబర్ 29వ తేదీన జన్మించిన సాగర్ ఖండ్రే కర్ణాటక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి తక్కువ వయసు ఉన్న వాడిగా నలిచి ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. కర్ణాటకలో 30 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మృణాల్, ప్రియాంక, సాగర్ ఖండ్రే, సంయుక్త పాటిల్ కు ఇంకా 30 ఏళ్ల వయసు నిండలేదు.
అలాగే మృణాల్, ప్రియాంక, సాగర్ ఖండ్రే, సంయుక్త పాటిల్, ప్రభా మల్లికార్జున్, మన్సూర్ ఆలీఖాన్, పద్మరాజ్, వినోద్ అసుటిలు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో ప్రయోగాలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది. కర్ణాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆధరించిన ప్రజలు ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపార్టీని ఆదరిస్తారో జూన్ 4వ తేదీ వరకు వేచిచూడాలి.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications