లోక్ సభ ఎన్నికలకు ముందే ఆ పార్టీకి ఝలక్, దెబ్బలో దెబ్బ అంటూ రాజీనామాలు, బై ఎలక్షన్!
గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్‌తో పాటు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మార్చి 23వ తేదీన మధ్యాహ్నం బీజేపీలో చేరనున్నట్లు ఆవర్గాలు తెలిపాయి. సభలో విప్‌ను ధిక్కరించినందుకు ఐదుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే అనర్హత వేటు పడింది.
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మా (హమీర్‌పూర్ నియోజకవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కెఎల్. ఠాకూర్ (నల్‌గఢ్) శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి యశ్‌పాల్ శర్మాకు వారి రాజీనామాలు సమర్పించి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ముగ్గురు స్వతంత్రులు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ను కోరుకున్నారు. అయితే ఆ ముగ్గురు నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించడంతో ఆ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత హిమాచల్ ప్రదేశ్ లో 40 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇటీవల ఆ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. మాపై, మా కుటుంబాలపై తప్పుడు కేసులు పెట్టే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారారని స్వతంత్ర ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆరోపించారు.
జూన్ 1వ తేదీన జరగనున్న చివరి దశ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన ఆరు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు, నాలుగు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించింది. అందువల్ల, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయకూడదని, ప్రజలు ఇచ్చిన తీర్పును, ఆ ఆదేశాలను గౌరవించాలని అన్నారు.

ఈ రాజీనామాల వెనుక ఏదైనా డబ్బులు ఎర వేశారా, లేదా ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం అన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో స్పీకర్ సహా 68 మంది సభ్యుల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ బలం 40 నుంచి 34కి పడిపోయింది. మొత్తం మీద సీఎం పెత్తనం ఎక్కువ కావడంతో తాము రాజీనామాలు చేశామని స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పడం హిమాచల్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications