బెంగళూరు ఆసుపత్రిలో ఖర్గే అడ్మిట్
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అనారోగ్య కారణాలతో ఇక్కడి ఎంఎస్ రామయ్య మల్టీ సూపర్ స్పెషాలిటీలో ఆసుపత్రిల్ చేరారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు ఖర్గే. మంగళవారం రాత్రి జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ట్రీట్మెంట్ అందించడానికి ప్రత్యేకంగా ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందాన్ని నియమించారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కొద్దిరోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పూర్తిగా కోలుకునేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతామని ఆసుపత్రి యాజమన్యం వెల్లడించారు.
జ్వరానికి గల కారణాలను తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయి. త్వరలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఖర్గే ఆసుపత్రిలో చేరారనే వార్త కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను కలవరపరిచింది. దేశవ్యాప్తంగా పార్టీ సీనియర్ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మల్లికార్జున ఖర్గే వయస్సు 83 సంవత్సరాలు. సీనియర్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు. 2022 అక్టోబర్ లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతీయ స్థాయిలో వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications