నకిలీ వేషాలు మాను.. తలపాగ చుడితే సర్ధార్జీ అవ‌రు.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు . ఓట్ల కోసం మోదీ రోజుకో వేషం వేస్తారంటూ సెటైర్లు విసిరారు.

 మోదీ త‌ల‌పాగ‌పై సెటైర్లు

మోదీ త‌ల‌పాగ‌పై సెటైర్లు

జలంధర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ తలపాగా ధరించడంపై ప్రియాంక గాంధీ చురకలు అంటించారు. తలపాగా ధరించగానే సర్థార్ కాలేరంటూ ఎద్దేవా చేశారు. నకిలీ వేషాలు వేషాలు వేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ తలపాగాలో క‌ఠోర‌శ్ర‌మ, ఎంత‌టి ధైర్యం దాగుందో మోదీ తెలుసుకోవాలన్నారు. పంజాబ్‌ను పంజాబీలమే న‌డిపించుకుంటార‌ని బీజేపీ, ఆప్‌ల‌కు చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

 బీజేపీ, ఆప్‌కు చుర‌క‌లు

బీజేపీ, ఆప్‌కు చుర‌క‌లు


పంజాబ్‌ను గుజ‌రాత్ మోడ‌ల్‌ను చేస్తామంటూ బీజేపీ, ఢిల్లీ మోడ‌ల్ చేస్తామంటూ ఆప్ లు నానా హ‌డావిడి చేస్తున్నాయని ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో ఏ ఒక్కరికి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు సజావుగా సాగవని ఆరోపించారు. ఢిల్లీ మోడల్‌ను పరిశీలిస్తే అక్కడ ఏ ఒక్క ఆస్పత్రి, విద్యాసంస్థలను కొత్తగా నిర్మించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరొసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

 కాంగ్రెస్‌లో అంతర్గత పోరు లేదు

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు లేదు


పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని ప్రియాంక గాంధీ అన్నారు. కేంద్రంలోని మోదీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ రైతులను, సామాన్యులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు లేదని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్ జిత్ సింగ్ పేర్కొన్నారు. మొత్తం 117 అసెంబ్లీ స్ధానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 20న ఒకే దశలో జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+