రెండు స్థానాల నుంచి సీఎం పోటీ - పంజాబ్ లో కాంగ్రెస్ తొలి జాబితా : విజయంపై ధీమా..!!
పంజాబ్ లో ఎన్నికల వాతావరణం హాట్ పెంచుతోంది. అధికార కాంగ్రెస్ ఇప్పటికే విజయం పైన ధీమాగా కనిపిస్తోంది. ఆప్ పార్టీ ఈ సారి ఇక్కడ తామే కింగ్ మేకర్లమని చెబుతోంది. ఆప్ జాతీయాధ్యక్షుడు కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్ధి పైన కొత్త విధానం అనుసరిస్తున్నారు. ఎసెమ్మెస్ ద్వారా అభ్యర్ధిని ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తమ తొలి జాబితా విడుదలకు సిద్దమైంది. 70 మంది అభ్యర్ధులతో జాబితాను ప్రకటించనున్నారు. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

70 మందితో తొలి జాబితా సిద్దం
సుదీర్ఘ కసరత్తు..అనేక వడపోతల తరువాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది పంజాబ్ కాంగ్రెస్. ఇందులో భాగంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ వర్చువల్‌గా భేటీ అయింది. 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని, త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. మరోమారు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది జాబితాను ఖరారు చేసింది. ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మరికొంత మంది నేతలు పేర్కొన్నారు.

రెండు స్థానాల నుంచి సీఎం పోటీ
సీఎం రెండు సీట్లలో పోటీపంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీని రెండు స్థానాల్లో బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చమ్‌కౌర్ నియోజకవర్గంతో పాటు మరో స్థానంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాయి. మాఝా ప్రాంతంలోని చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానంతో పాటు దోవోబా ప్రాంతంలోని అదంపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని బరిలో దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అలాగే.. సిట్టింగ్ ఎంపీలను సైతం అసెంబ్లీ బరిలో నిలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ సీనియర్ నేత వెల్లడించారు.

విజయం పైన కాంగ్రెస్ ధీమా
ఇక, పార్టీ కోరితే అసెంబ్లీ బరిలో నిలిచేందుకు తాను సిద్ధమని ప్రకటించారు కాంగ్రెస్ ఎంపీ జస్బిర్ సింగ్ గిల్. అయితే, ఆ నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందన్నారు. పోటీ చేయాలని ఆమె సూచిస్తే.. తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటానని ధీమాగా చెప్పారు. మరోవైపు.. త్వరలోనే పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా లాంటి వారిని ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉందని ఓ నేత చెప్పారు. ఒకే విడతలో జరిగే ఎన్నికల్లో విజయం పైన అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా... మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రభావం ఏంటనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications