• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతీయ కాంగ్రెస్‌లో రాజీనామాల ప్రకంపనలు... సీడబ్ల్వుసీలో తేలనున్న రాహుల్ భవితవ్యం..

|

సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ పక్షాలు పెద్ద ఎత్తున మెజారీటీ సీట్లు సాధించడంతో బీజేపీ భాగస్వామ్య పక్షాలకు 351 స్థానాలు సాధించడంతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. మొత్తం భాగస్వామ్య పక్ష పార్టీలతో కలిసి కనీసం వంద స్థానాలను కూడ సాధించలేని పరిస్థితి. రాహుల్ గాంధీ నాయకత్వం చేపట్టిన తర్వాత ఇలా ఘొర పరాజయం పాలవడం రెండవసారి కావడంతో అటు పార్టీ అధ్యక్షుడితో పాటు ఆయా రాష్ట్ర్రాల్లో పార్టీ అధ్యక్షులు నైతిక భాద్యత వహిస్తు రాజీనామల బాటపడుతున్నారు.

వరస కట్టి రాజీనామాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

వరస కట్టి రాజీనామాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

ఈనేపథ్యంలోనే ఫలితాలు వెలువడిన రోజునుండి ఆయా రాష్ట్ర్రాల పార్టీ అధ్యక్షులు పార్టీకి రాజీనామ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ యూపిలో పార్టీ ఓటమీకి నైతిక భాద్యత వహిస్తూ రాజీనామ లేఖను రాహుల్ గాంధికి పంపారు. కాగా పార్టీ సాధించిన ఫలితాలకు సంబంధించి గిల్టిగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.ఇక ఫలితాలు వెలువడిన రోజే పార్టీ ఒటమీకి నైతిక బాధ్యత వహిస్తూ ఒడిశా ఇంచార్జ్ నిరంజన్ పట్నాయక్‌తో పాటు కర్ణాటక సీనియర్ నాయకుడు పార్టీ ఇంచార్జ్ అయిన హెచ్‌కే పాటీల్ కూడ తన రాజీనామ లేఖను పంపించారు.

యూపీలో వైఫల్యం చెందిన కాంగ్రెస్

యూపీలో వైఫల్యం చెందిన కాంగ్రెస్

ఇక ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీతో పాటు జ్యోతిరాదిత్యా సింధియాతో పాటు ప్రచారం కొనసాగించింది.

ఈనేపథ్యంలోనే యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం సోనియాగాంధీ మినహా ఎవరు గెలిచిన పరిస్థితి లేదు. మరోవైపు ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ సైతం అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానిపై ఓడిపోయిన విషయం తెలిసిందే ఈనేపథ్యంలోనే బీజేపీ ఏకంగా 64 స్థానాలు సాధించంగా ఎస్పీ, బీఎస్సీలు కలిసి 15 స్థానాల్లో విజయం సాధించాయి. ఈనేపథ్యంలో పార్టీ ఇంచార్జ్ ఉన్న రాజ్ బబ్బర్ పార్టీ చీఫ్‌కు రాజీనామ లేఖ పంపారు.

రాహుల్ గాంధీ రాజీనామ చేస్తారంటూ ప్రచారం

రాహుల్ గాంధీ రాజీనామ చేస్తారంటూ ప్రచారం

ఇకమరోవైపు పార్టీ అధ్యక్షుడు కూడ రాజీనామకు సిద్దమైనట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో వాటిని పార్టీ అధికార ప్రతినిధి అయిన రణదీప్‌సింగ్ సూర్జేవాల ప్రకటించారు. కాగా రాహుల్ గాంధీ సైతం రాజీనామకు సంబంధించి అది పార్టీ అంతర్గత వ్యవహారమని దానికి సంబంధించి సీడబ్ల్యూసీ నాకు మధ్య చర్చించుకునే అంశమని ఆయన స్పష్టం చేశారు.

శనివారం సీడబ్ల్యూసీ సమావేశం

శనివారం సీడబ్ల్యూసీ సమావేశం

ఈనేపథ్యంలోనే శనివారం ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. ఈసమావేశానికి పార్టీ వర్కింగ్ కమీటి మెంబర్లతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాగాంధీలు కూడ హజరుకానున్నారు. దీంతో ఈసమావేశంలో రాహుల్ గాంధీ రాజీనామతోపాటు, ఇతర ఇంచార్జలు రాజీనామాలపై చర్చించనున్నారు.

 2014లో కూడ రాజీనామ చేసిన సోనియా రాహూల్ గాంధీలు

2014లో కూడ రాజీనామ చేసిన సోనియా రాహూల్ గాంధీలు

కాగా 2014లో కూడ యూపిఏ చైర్ పర్సన్,ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 49 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. దీంతో కనీసం ప్రతిపక్ష హోదాకూడ దక్కని పరిస్థితి ఎదురైంది. దీంతో ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి సోనియా గాంధీ రాజీనామ చేసింది. అయితే ఆమే రాజీనామను పార్టీ వర్కింగ్ కమిటి సభ్యులు అంగీకరించలేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after the Congress's second straight defeat in the national election, resignations were flying. Three state chiefs including Raj Babbar, the Congress's Uttar Pradesh president, sent their resignations to their boss Rahul Gandhi on Friday over the party's abysmal performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more