అగ్నిపథ్ నిరసనలు - కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష : దేశ వ్యాప్తంగా పార్టీ నేతలతో..!!
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. విధ్వంసాలకు కారణమయ్యాయి. అయినా, కేంద్రం మాత్రం స్వల్ప మార్పులు... కొన్ని చేర్పులతో పథకం కొనసాగింపుకే మొగ్గు చూపుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'అగ్నిపథ్' పై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలని నిర్ణయించింది. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు.. ఆదివారం ఉదయం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేయనున్నారు.

కాంగ్రెస్ కీలక నేతలు హాజరు
ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పందించారు. ఆ పథకాన్ని దిశానిర్దేశం లేకుండా రూపొందించారని ఆరోపించారు. దీనికి నిరసనగా యువత చేపట్టే కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని..అయితే శాంతియుతంగా హింసకు తావు లేకుండా నిరసనలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సోనియా క్రమేణా కోలుకుంటున్నారు. ఇంత భారీ స్థాయిలో యువత ఆందోళన వ్యక్తం చేస్తుంటే దీనిని విస్మరించటం సరి కాదన్నారు.

యువత ఆందోళనకు మద్దతు
పార్టీ నేత రాహుల్ సైతం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రైతు చట్టాల తరహాలో వీటిని వెనక్కు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. రైతులు - సైనికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలోనే తాను రైతు చట్టాలు రద్దు అవుతాయని చెప్పానని..అదే జరిగిందని, ఇప్పుడు కూడా ఈ నిర్ణయం వెనక్కు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఈ రోజు నిర్వహించాలని నిర్ణయించిన సత్యాగ్రహ దీక్షల్లో భాగస్వాములు కావాలని అన్ని పీసీసీలకు ఏఐసీసీ సూచించింది.

కేంద్రం సవరణలు.. తగ్గని నిరసనలు
పీసీసీ అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. ఇక, కేంద్రం ఈ పథకం పైన వస్తున్న నిరసనలతో కొనసాగింపు కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే అగ్నివీర్లకు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది. ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, కేంద్రం ఈ మొత్తం పరిణామాలను పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications