భారీ వర్షంతో భారత్ మండపం ప్రాంగణంలోకి నీరు: ‘వికాస్’ స్విమ్మింగ్ అంటూ కాంగ్రెస్ సెటైర్లు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జీ20 సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశాల రెండో రోజైన ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో ఢిల్లీ రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే, జీ20 సమావేశాలకు వేదికగా ఉన్న భారత్ మండపం ప్రాంగణంలోకి భారీ వర్షం కారణంగా వర్షపు నీరు చేరింది. అయితే, వెంటనే అధికార యంత్రాంగం నీటిని లేకుండా శుభ్రం చేసింది.

కాగా, అప్పటికే భారత్ మండపంలోకి వర్షపు నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. భారత్ మండపం వీడియోను ట్వీట్ చేస్తూ.. 'బోలు అభివృద్ధి బహిర్గతమైంది. జీ20 కోసం భారత్ మండపాన్ని సిద్ధం చేశారు. రూ. 2700 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క వర్షంతో నీరు వచ్చి చేరింది' అని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

Congress Says,Vikas Is Swimming, after G20 Venue Bharat Mandapam Flooded After Heavy Rain In Delhi

ట్విటర్‌లో వరదలు ముంచెత్తిన వేదిక దృశ్యాన్ని పంచుకుంటూ, వేదిక నుంచి నీటిని బయటకు పంపడానికి సిబ్బంది పనిచేస్తున్నారని చూపించిన యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ.. 'వికాస్ [అభివృద్ధి] ఈత కొడుతోంది' అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దీంతో కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆ నీటిని మీ ప్రభుత్వంలా కాదంటూ చురకలంటిస్తున్నారు.

కాగా, జీ20 దస్సును ఘనంగా నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా భారత్ మండపాన్ని నిర్మించింది. పలు ప్రత్యేక ఆకర్షణలతో ఈ మండపం నిర్మించారు. భారతదేశం సాధించిన సాంకేతిక విజయాలను భారత్ మండపంలో ప్రదర్శించారు. జీ20కి హాజరైన అతిథులు కూడా ఇండియా పెవిలియన్‌లో భారతదేశం శాస్త్రీ అభివృద్ధిని, దాని వారసత్వాన్ని ప్రశంసించారు.

మరోవైపు, ఆదివారం మధ్యాహ్నం తర్వాత జీ20 సమావేశాలు పలు కీలక తీర్మానాలు, ఒప్పందాలతో ముగిశాయి. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్ కొత్తగా ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో చేర్చుకున్న విషయం తెలిసిందే.ఇక, ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయంతో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదించబడింది. అయితే, అది రష్యాను నేరుగా నిందించలేదు. జీ20 సమావేశాల ముగింపు సందర్భంగా భారత్ తన అధ్యక్షత బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధాని నరేంద్ర మోడీ అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+