Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Loksabha polls 2024:తొలిదశ పోలింగ్ తర్వాత పుంజుకున్న కాంగ్రెస్ కూటమి..!

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత,ఇండియా కూటమి బిజెపి కంటే చాలా ముందంజలో ఉందని, సంకీర్ణానికి అనుకూలంగా బలం పుంజుకుంటోందని కాంగ్రెస్ శనివారం పేర్కొంది.21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఏడు దశల లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విటర్‌ పై పోస్టు చేశారు."బీజేపీ గ్రాఫ్: సౌత్ మే సాఫ్..నార్త్ మే హాఫ్"అంటూ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అంటే దీని అర్థం తొలి దశ పోలింగ్ తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని దక్షిణ భారతంలో బీజేపీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోగా.. ఉత్తరభారతంలో బీజేపీ సగానికి సగం కూలిపోయిందంటూ జైరాంరమేష్ వివరించారు.ఇండియా కూటమి బీజేపీ కన్నా చాలా ముందంజలో ఉందన్న విషయం అర్థమవుతోందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.

Congress Sees Momentum Shift Towards I N D I A after Initial Loksabha Polls

ఇక గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలిచారన్న విషయం తేటతెల్లమవుతోందన్న జైరాం రమేష్..తమిళనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని,బీహార్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్‌లలో గట్టపోటీని ఇచ్చిందని చెప్పుకొచ్చారు జైరాం రమేష్.ఇక కీలక రాష్ట్రాల్లో, లేదా బీజేపీకి పట్టున్న రాష్ట్రాల్లో ప్రదర్శన చెప్పుకునే స్థాయిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వచ్చిన ట్రెండ్స్‌తో బీజేపీ నాయకత్వం ఆందోళనలో ఉందని జైరాం రమేష్ అన్నారు. వారు ఏ స్థాయిలో అసహనంతో ఉన్నారో అని చెప్పేందుకు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌లే నిదర్శనమన్నారు జైరాం రమేష్.

దేశంలో మోదీ హవా లేనందున ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో కష్టపడి చేయాలని పార్టీ కార్యకర్తలకు కాషాయం పార్టీ ఆదేశించిందని దీన్ని బట్టే ఆపార్టీకి ఇక నూకలు చెల్లాయనే విషయం అర్థమవుతోందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.ఇక ప్రధాని మోదీ ప్రచారం చూస్తే అతని ప్రసంగంలో ఎలాంటి జోష్ కనిపించడం లేదని అతని ఇంటర్వ్యూలు చాలా పేలవంగా ఉన్నాయని ఎద్దేవ చేశారు. ఎన్నికలకు ప్రధాని మోదీ ఒక అజెండా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని జైరాం రమేష్ విమర్శించారు.

400 సీట్లతో అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని సవరించాలన్న బీజేపీ ఆలోచనలకు ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో తూట్లు పడతాయని జైరాం రమేష్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలతో పాటు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయని జైరాం రమేష్ చెప్పారు.దీంతో దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని చెప్పిన ఆయన... 2024లో ఇండియా కూటమి ప్రభుత్వంలోకి వస్తుందన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.ఇక తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+