నూతన అధ్యక్షుడు వచ్చేస్తున్నారు - నేడే అధికారికంగా..!!
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అధికారికంగా ఖరారు కానున్నారు. నేడు 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మల్లిఖార్జున ఖర్గే - శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ నెల 17న ఎన్నికలు జరగ్గా 96 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజున ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందు కోసం ఏఐసీసీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ముందుగా అభ్యర్ధుల సమక్షంలో బ్యాలెట్ బాక్సును ఓపెన్ చేస్తారు. బ్యాలెట్లను కలగలపి కట్టలు కడతారు. ఆ తరువాత ఓట్లను లెక్కిస్తారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 68 పోలింగ్ కేంద్రాల నుంచి ఈ బ్యాలెట్ బ్యాకులు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక దాదాపు లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సీనియర్ నేత శశి థరూర్‌పై ఆయన సునాయాసంగా విజయం సాధిస్తారని చెబుతున్నాయి. ఓటర్లుగా ఉన్న మొత్తం 9,900 మంది పీసీసీ ప్రతినిధుల్లో 9,500 మంది ఓటుహక్కు వినియోగించున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు ఖర్గేకే బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గాంధీ కుటుంబం దన్ను ఆయనకే ఉండడంతో థరూర్‌పై వివిధ రాష్ట్రాల్లో వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించింది.

ప్రచారానికి ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఖర్గేకు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన పీసీసీ అధ్యక్షులు.. థరూర్ వెళ్లిన సమయంలో ముఖం చాటేసారు. కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబ అభిప్రాయాలను వినాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. గాంధీయేతర నేత పగ్గాలు స్వీకరించినంత మాత్రాన ఫస్ట్ ఫ్యామిలీ గొంతు మూగవోయినట్లు కాదని తెలిపారు. వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు, పార్టీ వేదికల అభిప్రాయాలను కొత్త అధ్యక్షుడు గౌరవించాలన్నారు. సోనియా ఎప్పటికీ మాకు నాయకురాలు. ఇందులో సందేహమే అక్కర్లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అన్నారు. అన్నిటినీ మించి గాంధీ కుటుంబ సలహాలు, మద్దతు తీసుకోవడానికి సిగ్గెందుకని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక..మధ్నాహ్నానికి కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరనేది అధికారిక ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications