కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కారు ధ్వంసం... సొంత పార్టీ కార్యకర్తల పనే... పార్టీ నుంచి వెళ్లిపొమ్మని....
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌పై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ సంస్థాగత లోపాలు,అధినాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తప్పు పడుతున్నారు. కపిల్ సిబల్ తీరును నిరసిస్తూ బుధవారం(సెప్టెంబర్ 29) కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. కపిల్ సిబల్ కారును ధ్వంసం చేశారు. ఆయన ఇంట్లోకి టమాటాలు విసిరారు.'ఇకనైనా సోయిలోకి రండి... పార్టీని వీడండి...' అంటూ కపిల్ సిబల్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు.
పంజాబ్‌లో పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా... మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవడం... ఈ పరిణామాల నేపథ్యంలో కపిల్ సిబల్ మీడియా ముందుకు వచ్చారు.'ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు లేరు.మరి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు... మాకైతే ఆ విషయం తెలియదు... మేము జీ-23 నేతలమే.. కానీ జీహుజూర్ 23 నేతలం కాదు... సమస్యలు,లోపాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.' అని కపిల్ సిబల్ పేర్కొన్నారు.

'పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారు...? దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందుకోసం తక్షణం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచాలి.ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ఎదుర్కొంటున్న పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రం. అక్కడి పరిణామాలు ఐఎస్ఐ,పాకిస్తాన్‌కు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది.పంజాబ్‌లో అతివాదం పెరిగిన చరిత్ర తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీని వీడినవారు తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలి. ఈ దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే...' అని సిబల్ చెప్పుకొచ్చారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎంతలా పతనమైందో తెలిసిందే. నాయకత్వ లేమి కారణంగానే కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోలేకపోతున్నదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గానీ అగ్ర నేత రాహుల్ గాంధీ గానీ సీనియర్ల డిమాండుపై మౌనం వహిస్తూ వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీంతో వయసు,ఆరోగ్యం సహకరించకపోయినా... తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పటికీ సోనియానే ఆ పదవిలో కొనసాగుతున్నారు.అయితే ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం అవసరమని... అప్పుడే పార్టీ పుంజుకోగలదని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే కాంగ్రెస్‌కు చెందిన 23 మంది సీనియర్లు పార్టీ అధిష్ఠానానికి లేఖ ద్వారా వెల్లడించారు. అయితే అధిష్ఠానం మాత్రం సీనియర్ల సూచనలను పెద్దగా పట్టించుకోలేదు.
Recommended Video
అసలే దేశమంతా ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు అధికారంలో ఉన్న పంజాబ్,ఛత్తీస్‌గఢ్,రాజస్తాన్ రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అంతర్గత విభేదాల కారణంగానే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.రాజస్తాన్‌లోనూ అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఎపిసోడ్ తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ... అడపాదడపా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి.ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేష్ బాఘల్‌పై ఒక వర్గం వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ రాజీనామా తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్దూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం.. కెప్టెన్ అమరీందర్ బీజేపీతో టచ్‌లోకి వెళ్తుండటంతో పార్టీలో సంక్షోభం ముదురుతోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications