రాహుల్ గాంధీతోనే కాంగ్రెస్ పార్టీ అంతం అవుతోంది: కాంగ్రెస్ మాజీ లీడర్, మంత్రి !

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని గోవా మంత్రి, ఆపార్టీ మాజీ నేత విశ్వజిత్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి అది కచ్చితంగా జరుగుతోందని ఆయన జోస్యం చెప్పారు.

2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై గెలిచిన విశ్వజిత్ రాణే అనంతరం మార్చి 16వ తేదీన ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన విశ్వజిత్ రాణే కేబినెట్ హోదా ఇచ్చారు. గోవా ఆరోగ్య శాఖా నిర్వహిస్తున్న విశ్వజిత్ రాణే శనివారం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress would be wiped uot under Rahul Gandhi: Goa minister Rane

త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విశ్వజిత్ రాణే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా విశ్వజిత్ రాణే స్పంధిచారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదని అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారౌతుందని జోస్యం చెప్పారు. కోర్టులో మీద పిటిషన్ వేశారు కదా అని మీడియా అంటే నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరో సారి ప్రజల తీర్పు కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని విశ్వజిత్ రాణే సమర్థించుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nobody is interested in the Congress especially with failed leadership like that of Rahul Gandhi. The party will be white-washed in 2019, Goa minister Vishwajit Rane told reporters here today.
Please Wait while comments are loading...