Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు ఝలక్ ఇచ్చిన కన్స్యూమర్ కోర్టు.. నో రిటర్న్ పాలసీపై మొట్టికాయలు

e commerce: ఇంట్లోకి ఏ ఉత్పత్తి కావాలన్నా ఇ-కామర్స్ సైట్స్‌పై ఆధారపడటం ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. మొదట ఫ్రీ డెలివరీ, ఫ్రీ రిటర్న్ అంటూ ఊదరగొట్టిన సదరు కంపెనీలు.. తదనంతరం కాలంలో తమ అసలు రంగు బయటపెట్టాయి. కస్టమర్ ఇబ్బందిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వీటిపై వేలకొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే కోర్టు వరకు వెళుతున్నాయి.

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియాకు ముంబైలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెస్సల్ ఫోరమ్ గట్టి ఝలక్ ఇచ్చింది. లోపభూయిష్టమైన వస్తువును ఓ వినియోగదారునికి అంటగట్టి రిటర్న్ తీసుకునేందుకు నిరాకరించడంతో సదరు సంస్థతో పాటు ఆ ఉత్పత్తి విక్రేతకు కూడా కలిపి మొట్టికాయలు వేసింది. అంతటితో ఆగకుండా చట్టపరమైన ఖర్చుల కింద 10 వేలు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది.

Consumer Forum fired Flipkart and impose fine

ఫ్లిప్‌కార్ట్ తన 'నో రిటర్న్ పాలసీ' ప్రకారం ఉత్పత్తిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించడం అన్యాయమైన వాణిజ్య అభ్యాసం మరియు సేవలో లోపానికి సమానమని ప్రెసిడెంట్ సమిందర సర్వే మరియు సభ్యులు సమీర్ కాంబ్లే నేతృత్వంలోని ఫోరమ్ గుర్తించింది. కస్టమర్‌కు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో ఫ్లిప్‌కార్ట్ విఫలమైంది కాబట్టి మోనిటరీ బెనిఫిట్ కల్పించాలని తీర్పునిచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ సహా విక్రేత దీపక్ కశ్యప్‌పై ముంబైలోని గుర్గావ్ నివాసి తరుణ్ రాజ్‌పుత్ ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 9, 2023న ఫ్లిప్‌కార్ట్ నుంచి హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ లెమన్ ఫ్లేవర్ 13 కంటైనర్‌లను 4 వేల 641కి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 14న అవి డెలివరీ కాగా వాటి రంగు, ప్రొడక్ట్ సరిగా లేదని మరియు లేబుల్‌లో QR కోడ్ మిస్ అయిందని వెల్లడించారు. ఉత్పత్తి నకిలీదని అనుమానించి, దానిని రిటర్న్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అయితే ఫ్లిప్‌కార్ట్ తన 'నో రిటర్న్ పాలసీ'ని సాకుగా చూపి అభ్యర్థనను తిరస్కరించినట్లు వివరించారు.

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సర్వీస్‌కు కాల్‌ చేసి పలుమార్లు ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ సంతృప్తికరమైన సమాధానం లభించలేదని రాజ్‌పుత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి నాసిరకంగా ఉన్నప్పటికీ, రిటర్న్‌ను సులభతరం చేయడానికి ప్లాట్‌ఫారమ్ నిరాకరించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 లక్షల నష్టపరిహారాన్ని కోరినప్పటికీ ఉత్పత్తి హానికరం లేదా నకిలీదని రుజువు లేకపోవడంతో ఫోరమ్ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. కానీ అక్టోబర్ 21, 2023 నుంచి తిరిగి చెల్లింపు జరిగే వరకు 9 శాతం వడ్డీతో పాటు ఉత్పత్తి కోసం రాజ్‌పుత్ చెల్లించిన 4 వేల 641ని తిరిగి చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్ మరియు విక్రేతకే తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+