'స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా'.. కట్టిపడేసే అందాలు.. ఎలా వెళ్లాలి..?
టూర్లకు వెళ్లడమంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఏ ప్రాంతానికి వెళ్లాలి..? ఎలా వెళ్లాలి..? అని ఆలోచిస్తుంటారు. అయితే మనకు దగ్గరలోనే అందమైన పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన ఓ ప్రదేశం ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు.. కాఫీ, టీ తోటలు, మైమరిపించే జలపాతాలు, వ్యాలీలు, లోయలు.. ఇలా ఒక్కటేమిటీ ఈ టూరిస్ట్ స్పాట్ లో అన్నీ ఉన్నాయి. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అన్న పేరు వచ్చింది. మరి ప్రకృతి రమణీయమైన ప్రదేశం ఎక్కడ ఉందంటే..?
ఈ పర్యటక ప్రాంతం కర్ణాటకలోని కూర్గ్ లో ఉంది. దీన్ని కొడగు అని స్థానికులు పిలుస్తుంటారు. ఈ టూరిస్టు ప్రాంతం మైసూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవులు, టీ, కాఫీ తోటలు, పక్షుల, జంతువులు అరుపులు.. జలపాతాలు, లోయలు, వ్యాలీలు చాలానే ఉంటాయి ఇక్కడ. ఇది ఓ హిల్ స్టేషన్. శీతాకాలంలో ఇక్కడి అందాలను ఎంత చెప్పినా తక్కువే.. మరి కూర్గ్ లో ఏఏ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి..
కూర్గ్ లో చూడదగిన ప్రాంతాలు.. అబ్బే జలపాతం.. ఈ వాటర్ ఫాల్స్ కాఫీ తోటల మధ్య ఉంటుంది. ఇక్కడే నాగర్ హోళే నేషనల్ పార్క్ ఉంటుంది. దేశంలోనే అత్యుత్తమ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో ఇదీ ఒకటిగా నిలుస్తోంది. హనీ వ్యాలీ.. ఇదో ప్రసిద్ధి చెందిన నీలగండి జలపాతం. దట్టమైన అడవుల మధ్య ఈ జలపాతం ఉంటుంది. అలాగే హొన్నమన సరస్సు కూడా ఇక్కడ పర్యటకులను ఆకర్షిస్తుంది. కాఫీ తోటల మధ్య ఈ లేక అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే దూబారే ఎలిఫెంట్ క్యాంప్, ఓంకారేశ్వర ఆలయం, అలాగే పురాతన మైసూర్ రాజుల కట్టడాలు కూడా ఉన్నాయి. మరి కూర్గ్ ప్రాంతానికి ఎలా వెళ్లాలి..?

సికింద్రాబాద్ నుండి మైసూరుకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ క్లాస్ టికెట్ కేవలం రూ.450 ఉంటుంది. అక్కడి నుండి మడికెరికి బస్సు లేదా క్యాబ్ లో తక్కువ ధరకే చేరుకోవచ్చు. మడికెరి అంటే కొడగు జిల్లా కేంద్రం. దీంతో మీ ప్రయాణం తక్కువ ఖర్చుతోనే ముగుస్తుంది.












Click it and Unblock the Notifications