పాక్ ఉగ్రవాదుల దాడి: పోలీసు అధికారి బలి

శ్రీనగర్: ఉగ్రవాదులను పట్టుకునే సమయంలో జరిగిన ఎదురుకాల్పులలో ఓ పోలీసు అధికారి మరణించాడు. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకు సైన్యంకు పూర్తిగా సహకరించిన సబ్ ఇన్స్ పెక్టర్ ను పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.

జమ్మూ కాశ్మీర్ లో అల్తాఫ్ అహమ్మద్ సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన సాహసాలు గుర్తించి రాష్ట్రపతి పోలీసు మెడల్ అందించి గౌరవించారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదిన ఉదంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడుల ప్రధాన సూత్రదారి పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా కమాండర్ అబూ ఖాసీం అని పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాసీం కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు గాలిస్తున్నాయి.

Cop Killed Chasing Udhampur Attack Mastermind in Kashmir

అబూ ఖాసీం జమ్మూ కాశ్మీర్ లోని బందిపూర్ జిల్లాలో తలదాచుకున్నాడని అధికారులు గుర్తించారు. అతనిని అరెస్టు చెయ్యడానికి అల్తాఫ్ అహమ్మద్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి బందిపూర్ కు వెళ్లారు. ఖాసీం ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

అతనిని పట్టుకునే సందర్బంలో ఉగ్రవాదులు, పోలీసుల మద్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులలో అల్తాఫ్ మహమ్మద్ కు బుల్లెట్ గాయాలైనాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామని. చికిత్స విఫలమై మరణించారని అక్కడి డీజీపీ కే. రాజేంద్ర కుమార్ చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ లో కోవర్టు మిషనల్ లో భాగంగా అల్తాఫ్ అహమ్మద్ సైన్యానికి పూర్తిగా సేవలు అందించారని, అలాంటి అధికారి ఉగ్రవాదుల చేతిలో అంతం అయ్యాడని పోలీసు అధికారులు అంటున్నారు. సైన్యం నిర్వహించిన పలు ఆపరేషన్ లలో అల్తాఫ్ ఎంతో ధైర్యంగా విధులు నిర్వహించాడని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+