వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరూ రండి!: యూపీలో మీడియా సాక్షిగా పోలీసుల లైవ్ ఎన్‌కౌంటర్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

యూపీలో మీడియా సాక్షిగా పోలీసుల లైవ్ ఎన్‌కౌంటర్ (వీడియో)

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లో ఓ లైవ్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆరు హత్య కేసుల్లో నిందితులైన ఇద్దరు నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు జర్నలిస్టులను ఆహ్వానించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను స్వయంగా చూడాలని, వీడియో తీయాలని చెప్పారు.

63ఏళ్ల కాలేజీ చైర్మన్ రాసలీలలు: స్టాఫ్, అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దులిస్తూ63ఏళ్ల కాలేజీ చైర్మన్ రాసలీలలు: స్టాఫ్, అమ్మాయిల్ని బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దులిస్తూ

 నిజమైన ఎన్‌కౌంటర్ చూసేందుకు రావాలని

నిజమైన ఎన్‌కౌంటర్ చూసేందుకు రావాలని

రియల్ ఎన్‌కౌంటర్‌ను చూస్తూ వీడియో, ఫోటోలు తీసుకునేందుకు రావాలని అలీఘడ్ జిల్లాలోని విలేకరులకు పోలీసుల నుంచి ఉదయం ఫోన్ వచ్చింది. పోలీసులు ఫోన్ చేయగానే కాసేపట్లోనే జాతీయ, స్థానిక జర్నలిస్టులు హర్దూగంజ్ పోలీస్ స్టేషను పరిధిలోని మచువా గ్రామానికి పరుగు పెట్టారు. పాడుబడిన నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు కాల్పులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆరుగురి హత్య కేసులో నిందితులు

ఆరుగురి హత్య కేసులో నిందితులు

రాష్ట్రంలో దంపతులు, ఇద్దరు రైతులు, మరో ఇద్దరు పూజారులతో కలిసి మొత్తం ఆరుగురిని హతమార్చిన నేరస్థులైన ముస్తకిమ్, నౌషద్‌లు బైక్ పైన వెళ్తుండగా హర్దుగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ వినోద్ కుమార్ చూసి వారిని ఆపేందుకు యత్నించారు. కానీ దుండగులు పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయారు.

పోలీసులు అడ్డుకోగా వారిపై కాల్పులు, అందుకే ఎన్‌కౌంటర్

అనంతరం నీటిపారుదల శాఖ భవనంలో దాక్కున్నారు. అదనపు పోలీసు బలగాలను రప్పించిన పోలీసులు రియల్ లైవ్ ఎన్‌కౌంటర్‌ను చిత్రీకరించేందుకు వీలుగా మీడియాను ఆహ్వానించారు. హంతకులు ఇద్దరు పాడుబడిన కార్యాలయంలో దాక్కొని కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. భవనంలో నుంచి కాల్పులు ఆగిపోగానే లోపలకు వెళ్లి చూడగా, నిందితుల మృతదేహాలు కనిపించాయి.

పారదర్శకంగా ఉండేందుకే

పారదర్శకంగా ఉండేందుకే

మృతుల వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ గురించి పారదర్శకంగా మీడియాకు సమాచారం అందించేందుకే తాము మీడియాను లైవ్ ఎన్‌కౌంటర్‌‌కు ఆహ్వానించినట్లు అలీఘడ్ జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ సాహ్నీ తెలిపారు. మీడియా సాక్షిగా సాగిన ఈ హంతకుల ఎన్‌కౌంటర్‌ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ అవుతున్నాయి.

English summary
On Thursday, a handful of journalists received a call from the police at around 6.45 pm. The journalists who did not know what to expect reached the Machua village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X