వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పెనలా కరోనాకేసులు: 12వేలను దాటిన కొత్తకేసులు, 81వేలను దాటిన క్రియాశీల కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 12,249 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు దేశంలో 13 మరణాలు సంభవించాయి. అయితే యాక్టివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 2,300 కి పైగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుందని అర్థమవుతుంది.

81వేలను దాటి పెరిగిన యాక్టివ్ కేసులు

81వేలను దాటి పెరిగిన యాక్టివ్ కేసులు


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం (జూన్ 22) పంచుకున్న డేటా ప్రకారం, భారతదేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 81,687కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఈరోజు వెల్లడించింది. నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 79,313 కాగా ఆ సంఖ్య ఈరోజు మరింత పెరిగింది. యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 24 గంటల వ్యవధిలో 2,374 కి పెరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.18 శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ


గత 24 గంటల్లో దేశంలో మొత్తం 9,862 కరోనా మహమ్మారి బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ. దీంతో ఇప్పటి వరకూ మొత్తం రికవరీ రేటు దాదాపు 98.61 శాతానికి చేరుకుంది. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4,27,25,055 కి చేరుకుంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,24,903కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, కోవిడ్ -19 కోసం జూన్ 21 వరకు 85,88,36,977 నమూనాలను పరీక్షించారు. ఇందులో మంగళవారం ఒక్క రోజే 3,10,623 నమూనాలను పరీక్షించారు.

క్రియాశీల కేసుల పెరుగుదల ఆందోళన కలిగించే అంశం

క్రియాశీల కేసుల పెరుగుదల ఆందోళన కలిగించే అంశం

క్రియాశీల కేసులు 81000 దాటి పెరిగిపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు మునుపటి రోజుతో పోలిస్తే 23 శాతం అధికంగా నమోదవడం కరోనా వ్యాప్తికి అద్దం పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో భారీ గా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,659 తాజా ఇన్‌ఫెక్షన్లు నమోదవడంతో పాటు ఒక్క మరణం నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం రోజువారీ కోవిడ్ కేసులు పెరిగాయి. సోమవారం నమోదైన 2,354 కేసుల కంటే 1,305 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్నటి కేసులు కంటే 55 శాతం ఎక్కువ.

మహారాష్ట్రలో కరోనా పంజా... వివరాలివే

మహారాష్ట్రలో కరోనా పంజా... వివరాలివే

కోవిడ్‌ కేసుల సంఖ్య 79,41,762 కాగా, మరణాల సంఖ్య 1,47,889కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3,356 మంది డిశ్చార్జ్‌ కాగా, మహారాష్ట్రలో కోలుకున్న వారి సంఖ్య 77,68,958కి చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా రికవరీ రేటు 97.82 శాతం, మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఇక కరోనా సానుకూలత రేటు 10.13 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 36,094 నమూనాలను పరిశీలించడంతో, రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 8,16,65,314కి చేరుకుంది.

English summary
Corona new cases are being registered as a surge. Corona cases are a concern, with more than 12,000 new cases and more than 81,000 active cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X