వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో మళ్ళీ భారీగా .. గత 24 గంటల్లో 42,015 కరోనా కొత్త కేసులు, 3,998 మరణాలకు రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

నిన్న కాస్త ఊపిరి తీసుకున్నట్టే అనిపించిన కరోనా కేసులు, ఈ రోజు మళ్ళీ భారీగా పెరిగాయి. భారతదేశం గత 24 గంటల్లో 42,015 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,12,16,337 కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో 3,998 కొత్త మరణాలు నమోదయ్యాయని సమాచారం.

భారత్ కు ఊరట .. 30,093 కేసులతో నాలుగు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు, 374మరణాలుభారత్ కు ఊరట .. 30,093 కేసులతో నాలుగు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు, 374మరణాలు

మహమ్మారి ప్రారంభం నుండి మొత్తం 4,18,480 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. నిన్న 30 వేలకు తగ్గిన కేసులు ఈరోజు ఒక్కసారిగా పెరగడంతో మొత్తం 40 శాతం మేర కేసులు పెరిగినట్లుగా తెలుస్తుంది. కోవిడ్ -19 యొక్క చురుకైన కేసులు కూడా గత 24 గంటల్లో 1,040 తగ్గి 4,07,170 వద్ద స్థిరపడ్డాయి. ఇవి మొత్తం ఇన్ఫెక్షన్లలో 1.30% గా ఉన్నాయి. గత 24 గంటల్లో 36,977 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దీంతో దేశ పునరుద్ధరణ రేటు బుధవారం 97.37% గా ఉంది .

 Corona deaths on the rise in India - 2,020 deaths, 31,443 new cases in last day

కరోనా ఘోరంగా విజృంభించిన సెకండ్ వేవ్ నుండి దేశం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించి వైద్య మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేసే స్థాయికి పంజా విసిరింది. రెండవ వేవ్ యొక్క గరిష్ట స్థాయిలో, భారతదేశం మే 6 న 24 గంటల వ్యవధిలో 4,14,188 రోజువారి కేసులను నమోదు చేసిందంటే ఎలాంటి పరిస్థితులను చూశామో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుండి ఈ కేసులు క్రమంగా తగ్గాయి. భారతదేశం 125 రోజుల్లో 30,093 ఇన్ఫెక్షన్ల వద్ద 125 రోజులలో అత్యల్ప రోజువారీ కేసులను నిన్న నమోదు చేసింది. అంతలోనే మరో మారు కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించింది.

Recommended Video

Covid-19 Third Wave లో భారత్ లో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం - ICMR | Oneindia Telugu

ఇక తాజాగామహారాష్ట్ర తన డేటాను సవరించిన తరువాత 3,509 కోవిడ్ మరణాలను జోడించింది. ఇది మొత్తం మరణాలలో భారీ పెరుగుదలకు దారితీసింది. మిగతా రాష్ట్రాల నుండి 489 కొత్త మరణాలు సంభవించాయి, మొత్తం 3,998 కు చేరుకుంది. మహమ్మారి ప్రారంభం నుండి మొత్తం మరణాలు 4.18 లక్షలు దాటిందని అధికారిక డేటా చెపుతోంది. ఏదేమైనా కరోనా కేసులు ఊగిసలాట మధ్య దేశం ఇంకా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతూనే ఉంది.

English summary
India on Wednesday recorded 42,015 fresh cases of coronavirus infections, taking the cumulative tally past 31,216,337 data from the Union ministry of health and family welfare showed. The country also recorded 3,998 new fatalities in the last 24 hours, data showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X