Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హరిద్వార్ లో మహా కుంభమేళా .. కరోనా ఎఫెక్ట్ తో నెలరోజులే .. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ సమయంలో హరిద్వార్ లో నిర్వహించే కుంభమేళాకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లు చేసుకుని రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.

మహా కుంభమేళా పుణ్య స్నానానికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

మహా కుంభమేళా పుణ్య స్నానానికి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

హరిద్వార్ కుంభమేళా యాత్రికులు ఇప్పుడు కోవిడ్-19 "నెగటివ్" నివేదికను తప్పనిసరిగా చూపించాల్సి ఉంది. ప్రజలు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కుంభమేళాలో పాల్గొనటానికి ఆర్ టి పి సి ఆర్ పరీక్ష నివేదిక తప్పనిసరిగా చేయించుకొని కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ వస్తేనే రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా కుంభమేళా యొక్క వ్యవధి చరిత్రలో మొదటిసారిగా నెల రోజులకు తగ్గించబడింది.

కుంభమేళా ఏప్రిల్ 1 నుండి 30 వరకు హరిద్వార్ లో మహా కుంభమేళా

కుంభమేళా ఏప్రిల్ 1 నుండి 30 వరకు హరిద్వార్ లో మహా కుంభమేళా


నోటిఫికేషన్ ప్రకారం, హరిద్వార్ లోని గంగా ఒడ్డున నిర్వహించే కుంభమేళా ఏప్రిల్ 1 నుండి 30 వరకు జరుగుతుంది, ఏప్రిల్ 12, 14 మరియు 27 తేదీలలో మూడు "షాహి స్నాన్" లేదా ప్రధాన స్నాన తేదీలు ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు గంగలో మునిగి వారి పాప ప్రక్షాళన చేసుకోవడానికి కుంభమేళా మంచి వేదికగా భావిస్తారు . వారి సంఖ్య ప్రధాన స్నాన తేదీల రోజులలో అనేక రెట్లు పెరుగుతుంది. ఏప్రిల్ 13 న చైత్ర ప్రతిపదం, ఏప్రిల్ 21 న శ్రీరామ నవమి సందర్భాలలో కూడా భారీగా భక్తులు కుంభమేళా లో పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.

12 ఏళ్ళకోసారి జరిగే మహా ఘట్టం .. ఈ సారి కుంభమేళా ప్రాంతాలివే

12 ఏళ్ళకోసారి జరిగే మహా ఘట్టం .. ఈ సారి కుంభమేళా ప్రాంతాలివే

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళ సాధారణంగా మూడున్నర నెలలు ఉంటుంది. గతంలో కుంభమేళ జనవరి 14 నుండి 2010 ఏప్రిల్ 28 వరకు హరిద్వార్‌లో జరిగింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, కుంభమేళా జరిగే ప్రాంతం నీర్ ఘర్ , తపోవన్, బిట్టల్ ఆశ్రమం మార్గ్ నుండి ముని-కి-రెటి రోడ్ మరియు రిషి-హరిద్వార్ బైపాస్‌ను కలిగి ఉంది . ఉత్తరాన నరేంద్ర నగర్-రిషికేశ్ బైపాస్, రిషికేశ్-డెహ్రాడూన్ రోడ్‌లోని అటవీ చెక్‌పోస్ట్, రిషికేశ్-హరిద్వార్ బైపాస్, మన్సా దేవి, బిల్కేశ్వర్ మందిర్, టిబ్రీ మోహంద్, భెల్ నివాస భవనాలు, రూర్కీ-బహదరాబాద్ రహదారి మరియు హరిద్వార్ లో 13 కిలోమీటర్ల వరకు పశ్చిమాన ఢిల్లీ రహదారిలో జరగనుంది. దక్షిణాన, కుంభమేళా జరిగే ప్రాంతం బహదరాబాద్-హరిద్వార్ బైపాస్ నుండి సిద్ధా సోట్ సేతు వరకు మరియు సిద్ధా సోట్ సేతు నుండి తూర్పున నీలకంఠ మహాదేవ్ ఆలయం వరకు విస్తరించి ఉంటుంది.

 72 గంటల లోపు నిర్వహించిన

72 గంటల లోపు నిర్వహించిన "నెగటివ్" ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదిక ఉంటేనే పుణ్య స్నానానికి అనుమతి

కుంభమేళా లో పాల్గొనేవారు 72 గంటల లోపు నిర్వహించిన "నెగటివ్" ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదికను సమర్పించాల్సి ఉంటుందని భక్తులకు ఉత్తరాఖండ్ హైకోర్టు తప్పనిసరి చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భక్తులు తమ సర్టిఫికెట్లను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది .

కుంభమేళా సమయంలో కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం పిలుపునిచ్చిన తరువాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కేంద్రం లేఖ .. కఠిన నియమాలకు నిర్ణయం

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కేంద్రం లేఖ .. కఠిన నియమాలకు నిర్ణయం

నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్తల కోసం గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల దృష్ట్యా, ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ సోమవారం జిల్లా పరిపాలనలు, వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర భాగస్వాములను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఫేస్ మాస్క్ ధరించడం, ప్రజల పరిశుభ్రత మరియు సామాజిక దూరాన్ని నిర్వహించడం వంటి అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు . మహా కుంభమేళా సమయంలో మహమ్మారి వ్యాప్తి పెరగనున్న నేపథ్యంలో కఠినమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంభమేళ నిర్వహణకు కఠిన కరోనా నియమ, నిబంధనలతో రెడీ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+